మెగాస్టార్ చిత్రాన్ని సొంతం చేసుకున్నారుగా!


మెగాస్టార్ చిత్రాన్ని సొంతం చేసుకున్నారుగా!
మెగాస్టార్ చిత్రాన్ని సొంతం చేసుకున్నారుగా!

సంక్రాంతి స‌మ‌రం ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. ఈ పోటీలో మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`, అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` బ్లాక్ బ‌స్ట‌ర్‌లుగా నిలిచాయి. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల సునామీని సృష్టించాయి. అ రెండు చిత్రాల్ని నైజాంలో పంపినీ చేసి నిర్మాత దిల్ రాజు ఈ రెండు చిత్రాల‌తో సంక్రాంతి విజేత అనిపించుకున్నారు.

తాజాగా ఆయ‌న క‌న్ను మెగాస్టార్ చిరంజీవి చిత్రంపై ప‌డింద‌ట‌. ఇంకేముంది నైజాం రైట్స్‌ని ఎంత పోటీ వున్నా చేజిక్కించుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ అంశం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రం త‌రువాత మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించిన విష‌యం తెలిసిందే. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కి త‌న‌దైన మార్కు సందేశాన్ని జోడించి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని సొంతం చేసుకుంటున్న కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

కొర‌టాల స్నేహితుడు నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి హీరో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే పాట చిత్రీక‌ర‌ణతో రెగ్యుల‌ర్ షూటింగ్‌ ప్రారంభించారు. ప్రారంభం నుంచే ఈ సినిమాపై ట్రేడ్ వ‌ర్గాల్లో భారీ క్రేజ్ నెల‌కొంది. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ఈ చిత్ర నైజాం ఏరియా ప్ర‌ద‌ర్శన హ‌క్కుల్ని భారీ మొత్తం చెల్లించి నిర్మాత దిల్ రాజు సొంతం చేసురోవ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.