సోషల్ మీడియా ని పిచ్చ పిచ్చగా వాడుకుంటున్నారు


Dil Raju brings bad news for hero Vijay Deverakonda fans

సోషల్ మీడియాని పిచ్చ పిచ్చగా వాడుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్ర బృందం . యూత్ లో పిచ్చ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ కాగా ఈ హీరో నటించిన చిత్రం గీత గోవిందం . పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 సంస్థ నిర్మించింది ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేసేది ఎవరో తెలుసా ఛలో భామ రష్మిక మండన . ఇప్పటికే రష్మిక – విజయ్ దేవరకొండ ల మధ్య రొమాన్స్ వీర లెవల్లో పండింది . విజయ్ కామెంట్స్ కి రష్మిక ఇస్తున్న రిప్లయ్ అలాగే రష్మిక మాటలకూ విజయ్ ఇస్తున్న సరసమైన సంభాషణ యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది . ఇక అసలు విషయానికి వస్తే ……..

ఈరోజు గీత గోవిందం టీజర్ ని విడుదల చేయాలనుకున్నారు , కానీ దిల్ రాజు సడెన్ గా ఫోన్ చేసి నా సినిమా శ్రీనివాస కళ్యాణం టీజర్ ని విడుదల చేస్తున్నాం కాబట్టి మీ టీజర్ ని వాయిదా వేసుకోండి అని చెప్పడంతో దాన్ని కూడా పబ్లిసిటీ కి వాడుకున్నారు గీత గోవిందం చిత్ర బృందం . దిల్ రాజు నిర్ణయం విజయ్ దేవరకొండ అభిమానులకు బ్యాడ్ న్యూసే ఎందుకంటే ఒకరోజు ఆలస్యంగా టీజర్ ని తిలకించనున్నారు . అయితే అతడి కోరిక మేరకు మా గీత గోవిందం టీజర్ ని రేపటికి ( 23) వాయిదా వేశామని ఓ పోస్టర్ ని డిజైన్ చేయించి మరీ సోషల్ మీడియాలో వదిలారు . ఇప్పుడు అది ట్రెండ్ అవుతోంది . మొత్తానికి వాడకంలో విజయ్ దేవరకొండ తో పాటు అతడి నిర్మాతలు కూడా రాటుదేలి పోయారు .

English Title: Dil Raju brings bad news for hero Vijay Deverakonda fans