బ‌న్నీ పుట్టిన రోజు సాక్షిగా `ఐకాన్‌`పై క్లారిటీ!


బ‌న్నీ పుట్టిన రోజు సాక్షిగా `ఐకాన్‌`పై క్లారిటీ!
బ‌న్నీ పుట్టిన రోజు సాక్షిగా `ఐకాన్‌`పై క్లారిటీ!

అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రానికి `పుష్ప‌` అనే టైటిల్‌ని చిత్ర బృందం బుధ‌వారం బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా క‌న్ఫ‌మ్ చేసి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బ‌న్నీకి జోడీగా క్రేజీ భామ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

శేషాచ‌లం అడ‌వుల్లో గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగ‌నుంది. పిరియాడిక్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌గా ర‌గ్గ్‌డ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లలు పెట్ట‌నున్న ఈ చిత్రం డ‌న్నీ ఫ్యాన్స్‌కి ఓ పండ‌గే అంటున్నారు. ఇదిలా వుంటే బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా నిర్మాత దిల్ రాజు రూమ‌ర్‌ల‌పై క్లారిటీ ఇచ్చారు.

బ‌న్నీ హీరోగా దిల్ రాజు `ఐ కాన్` క‌నిపించుట‌లేదు పేరుతో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రం ఇక ఆగిపోయిన‌ట్టే అని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ ప్ర‌చారానికి చెక్ పెడుతూ ఈ సినిమా వుంటుంద‌ని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఐకాన్ పోస్ట‌ర్‌ని ట్వీట్ చేస్తూ బ‌న్నీకి బ‌ర్త్‌డే విషెస్‌ని అందించారు.