బ‌న్నీ డ్యాన్సుల‌తో ఇర‌గ్గొట్టేశాడు!


బ‌న్నీ డ్యాన్సుల‌తో ఇర‌గ్గొట్టేశాడు!
బ‌న్నీ డ్యాన్సుల‌తో ఇర‌గ్గొట్టేశాడు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో నిర్మాత దిల్ రాజుకు మధ్య మంచి అనుబంధం వుంది. `ఆర్య‌` నుంచి ఆ అనుబంధం అలాగే కొన‌సాగుతోంది. బ‌న్నీ న‌టించిన చాలా సినిమాల‌కు దిల్‌రాజు నైజామ్‌లో రిలీజ్ చేస్తుంటారు కూడా. ఆర్య‌, ప‌రుగు, డీజే వంటి చిత్రాలు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చి మంచి విజ‌యాల్ని సాధించాయి. ఆ అనుబంధంతో బ‌న్నీ న‌టిస్తున్న `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాన్ని నైజామ్‌, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన `అల వైకుంఠ‌పుర‌ములో` మ్యూజిక్ కాన్సెర్ట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న దిల్ రాజు సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

`అల వైకుంఠ‌పుర‌ములో` సెట్‌లో ఈ వేడుక‌ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ డిజైన్ చేయ‌డం ఆనందంగా వుంది, రిలీజ్‌కు ముందే బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టేశారు. ఇప్ప‌టికే త‌మ‌న్ పాట‌ల‌తో ఇర‌గ్గొట్టేశాడు. స్టైలిష్ స్టార్ బ‌న్నీ త‌న డ్యాన్సుల‌తో ఇర‌గ‌దీసేశాడు. త్రివిక్ర‌మ్ త‌న పంచ్ డైలాగ్‌ల‌తో ఇర‌గ‌దీశారు. సినిమా బాగుంది అంటే చాలు మెగా ఫ్యాన్స్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని చేసేస్తారు. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకున్నారు.

ఇక త‌మ‌న్ సంగీతం గురించి మాట్లాడుతూ ` ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి మ్యూజిక‌ల్ హిట్ ఆల్బ‌మ్‌ని తాను చూడ‌లేద‌ని, ఇప్ప‌టికే ఒక్కో పాట వంద మిలియ‌న్‌ల‌ని దాటింద‌ని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. అల `వైకుంఠ‌పుర‌ములో` ఈ నెల 12న, దిల్ రాజు వ‌న్ ఆఫ్ ద ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ సంక్రాంతి బ‌రిలో ఈ రెండు చిత్రాల మ‌ధ్యే పోటీ ప్ర‌ధానంగా వుండ‌బోతోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.