దిల్ రాజు కుమార్తె ఎమోష‌న‌ల్ పోస్ట్‌!


దిల్ రాజు కుమార్తె ఎమోష‌న‌ల్ పోస్ట్‌!
దిల్ రాజు కుమార్తె ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హ‌న్షిత‌రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది.త‌న త‌ల్లి అనిత‌కు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసిన హ‌న్షిత దానికి ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్‌ని జ‌త‌చేసింది. ఉన్న‌ట్టుండి హ‌న్షిత‌కు త‌ల్లి అనిత గుర్తుకు రావ‌డానికి కార‌ణం ఈ రోజు ( శుక్ర‌వారం) ఆమె జ‌యంతి. ఈ సంద‌ర్భంగా త‌ల్లి జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకున్న హ‌న్షిత త‌ల్లి తో వున్న ఓ ఫోటోని షేర్ చేసింది.

`పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అమ్మా.. నేను నిన్ను చాలా మిస్స‌వుతున్నా..నీ జ్ఞాప‌కాలు ఎల్ల‌ప్పుడూ నాతోనే వుంటాయి. వాటితోనే జీవిస్తున్నా. కొన్ని రోజులు నేను నీతో వున్న ఎన్నో జ్ఞాప‌కాలు.. నీతో క‌లిసి దిగిన ఫొటోలు.. నీ చిరున‌వ్వు దృశ్యాలెన్నో.. ` అంటూ భావోద్వేగ‌భ‌రింత‌మైన పోస్ట్‌ని షేర్ చేసింది. దిల్ రాజు ఇటీవ‌లే వైఘారెడ్డిని రెండ‌వ వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

దిల్ రాజు మొద‌టి భార్య అనిత అనారోగ్య కార‌ణంగా 2017లో మృతి చెందింది. ఆ త‌రువాత నుంచి దిల్ రాజు ఒంట‌రిగానే వుంటున్నారు. త‌న తండ్రి ఒంట‌రిగా వుండ‌టం ఇష్టం లేని హ‌న్షిత‌రెడ్డి ఒప్పించి తేజ‌స్వినితో వివాహం జ‌రిపించింది. వివాహం త‌రువాత తేజ‌స్విని పేరుని వైఘారెడ్డిగా దిల్‌రాజు మార్చేసిన విష‌యం తెలిసిందే.