మరోసారి సంక్రాంతి పై కన్నేసిన దిల్ రాజు


dil raju F 2 in pongal race 2019అగ్ర నిర్మాత దిల్ రాజు మరోసారి సంక్రాంతి పై కన్నేశాడు . ఇప్పటికే పలుమార్లు సంక్రాంతి బరిలో విజయాలు అందుకున్న దిల్ రాజు తాజాగా మరోసారి సంక్రాంతి బరిలో తన చిత్రాన్ని దింపడానికి సన్నాహాలు చేస్తున్నాడు . గత ఏడాది అగ్ర హీరోలతో పోటీపడి మరీ శతమానం భవతి చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసాడు దిల్ రాజు వచ్చే ఏడాది సంక్రాంతి కి సీనియర్ హీరో వెంకటేష్ – వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ” F 2” చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .

వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి హ్యాట్రిక్ సక్సెస్ లు అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు . పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు అనిల్ రావిపూడి . దిల్ రాజు – అనిల్ రావిపూడి , వెంకటేష్ , వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కావడంతో F 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి .

ఈ సంక్రాంతి కి బాలయ్య నటిస్తున్న ” ఎన్టీఆర్ ” , చరణ్ – బోయపాటి ల సినిమా కూడా సంక్రాంతి కే అనుకుంటున్నారు దాంతో ఆ సినిమాలతో పోటీ పడనుంది దిల్ రాజు సినిమా . మరి ఈ మూడింటిలో ఏది హిట్ కొడుతుందో ? ఏది రిలీజ్ డేట్ మారుతుందో ? చూడాలి .