దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి హీరో రెడీ!

దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి హీరో రెడీ!
దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి హీరో రెడీ!

గత కొన్ని నెలలుగా టాలీవుడ్ స్టార్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తిని హీరోగా పరిచయం చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయి‌తే ఇప్ప‌టి వ‌ర‌కు దిల్ రాజు క్యాంప్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. తాజాగా ఓ సాలీడ్ అప్‌డేట్‌తో త‌న ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్న హీరోని దిల్‌రాజు అండ్ కో ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు.

ఈ ఫ్యామిలీ అంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. ఈ నెల 8న అంటే గురువారం శిరీష్ త‌న‌యుడు ఆశిష్ ఇంట్రడక్షన్ వీడియోని విడుద‌ల చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్త‌యిపోయాయి. ఈ నెల 9న ఇదే సంస్థ నిర్మించిన చిత్రం రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. దానికి స‌రిగ్గా ఒక్క‌రోజు ముందు ఆశిష్ ఇంట్రడక్షన్ వీడియోని రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిన‌ట్టు తెలిసింది.

ఆశిష్ హీరోగా ప‌రిచ‌యం కానున్న చిత్రానికి  ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్‌ని పెట్టారు. ఈ చిత్రానికి ‘హుషారు’ ఫేమ్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు.‘రాక్‌స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, ఏస్ సినిమాటోగ్రాఫర్ మ‌దీ వ‌ర్క్ చేయ‌బోతున్నారు. హీరోయిన్‌గా బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తోంది.
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని ఎస్వీసీ బ్యానర్‌లో  నిర్మిస్తున్నారు.