మహానటి ని వదులుకొని బాధపడుతున్న దిల్ రాజు


dil raju feels very sad with mahanati

అగ్ర నిర్మాత దిల్ రాజు మహానటి చిత్రాన్ని వదులుకొని బాధపడుతున్నాడు . ఈ బాధ ఎంతగా అంటే కుమిలి కుమిలి పోతున్నాడు దిల్ రాజు . ఈ అగ్ర నిర్మాత ఇంతగా బాధపడటానికి కారణం ఏంటో తెలుసా ……. ….. మహానటి చిత్రాన్ని అసలు దిల్ రాజు విడుదల చేయాలి ముందుగా అనుకున్న ప్రకారం అయితే అతడి పై శని కూర్చోవడం వల్ల మహానటి రిలీజ్ కి దగ్గర పడుతున్న సమయంలో మహానటి ని కాదనుకొని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ” మెహబూబా ” చిత్రాన్ని విడుదల చేసాడు .

వదులుకున్న మహానటి యావత్ ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటుండగా దిల్ రాజు రిలీజ్ చేసిన మెహబూబా మాత్రం డిజాస్టర్ అయ్యింది అంతేకాదు …… మహానటి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెడుతుండగా లాభాలు వచ్చే సినిమాని వదులుకొని మెహబూబా చిత్రాన్ని 9 కోట్లు ఖర్చు పెట్టాడు ఇప్పుడవి బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది . పోయిన డబ్బు ఎలాగూ పోతోంది కానీ వద్దనుకున్న మహానటి భారీ లాభాలు తెస్తుండటంతో దిల్ రాజు కుమిలి పోతున్నాడట .