ఫ‌స్ట్ సెల్ఫీ క్లిక్కుమ‌నిపించారు!


ఫ‌స్ట్ సెల్ఫీ క్లిక్కుమ‌నిపించారు!
ఫ‌స్ట్ సెల్ఫీ క్లిక్కుమ‌నిపించారు!

టాలీవుడ్‌లో స‌క్సెస్‌ల‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన నిర్మాత దిల్ రాజు. ఆయ‌న మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు షికారు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ నెల 10వ తేదీన ఆదివారం రాత్రి నిజామాబాద్‌ స్వ‌గ్రామంలోని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో దిల్ రాజు రెండ‌వ వివాహం చేసుకున్నారు.

లాక్‌డౌన్ కార‌ణంగా ఈ వివాహానికి దిల్‌రాజు కుటుంబ స‌భ్యుల మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. బ్రామ్‌మ‌ణ యువ‌తి అయిన తేజ‌స్వినిని దిల్‌రాజు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి దిల్ రాజు కుమార్తె అన్నీ తానై నిలిచింది. తేజ‌స్విని పేరుని జాత‌కం ప్ర‌కారం వైఘారెడ్డిగా మార్చారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే.

తాజాగా వీరికి సంబంధించిన ఓ ఫొలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వివాహం జ‌రిగి మూడు రోజులు అవుతెండ‌టంతో దిల్‌రాజు, ఆయ‌న స‌తీమ‌ణి వైఘారెడ్డి స‌ర‌దాగా ఓ సెల్ఫీని క్లిక్ మ‌నిపించారు. అదే ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దిల్‌రాజు ప్ర‌స్తుతం వీక‌ల్‌సాబ్‌, వి చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో `వి` త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.