దిల్ రాజు కు అక్కడ పెద్ద దెబ్బే పడింది


Dil raju gets hattric flops with hello guru prema kosame

దిల్ రాజు కు ఈ ఏడాది అంతగా కలిసి రానట్లుంది. ఈమధ్య నిర్మించిన మూడు చిత్రాలు కూడా ప్లాప్ అయ్యాయి. ముఖ్యంగా ఓవర్ సీస్ లో దిల్ రాజు చిత్రాలకు పెద్ద దెబ్బే పడింది. రాజ్ తరుణ్ హీరోగా నిర్మించిన లవర్ గూబ గుయ్ మనేలా చేసింది. అలాగే నితిన్ హీరోగా నిర్మించిన శ్రీనివాస కల్యాణం కూడా ఓవర్ సీస్ లో ప్లాప్ అయ్యింది కట్ చేస్తే ఇప్పుడు హాలో గురూ ప్రేమకోసమే చిత్రంతో హ్యాట్రిక్ ప్లాప్ లను మూట గట్టుకున్నాడు దిల్ రాజు. దసరా కానుకగా అక్టోబర్ 18న హాలో గురూ ప్రేమకోసమే చిత్రం విడుదల అయ్యింది. రామ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలలో వసూళ్లు ఫరావలేదనిపించే స్థాయిలో వస్తున్నాయి. అయితే ఓవర్ సీస్ లో మాత్రం గట్టి దెబ్బే పడింది. ఇప్పటి వరకు కనీసం హాఫ్ మిలియన్ మార్క్ ని చేరుకోలేదు అంటే హాలో గురూ ప్రేమకోసమే చిత్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు పరిస్థితి. కాకపోతే గుడ్డిలో మెల్ల లాగా 14 కోట్ల కు పైగా షేర్ రాబట్టింది. అంటే అందరికీ లాభాలు రావాలంటే మరో పది కోట్ల వసూళ్లు రావాలి కానీ ఆ పరిస్థితి అయితే లేదు. దాంతో దిల్ రాజు కు హ్యాట్రిక్ ప్లాప్స్ వచ్చినట్లే.

English Title: Dil raju gets hattric flops with hello guru prema kosame