ఫ్లాప్ లలో హ్యాట్రిక్ కొట్టిన దిల్ రాజు


Dil raju gets hattric flops

ఈ ఏడాది ద్వితీయార్ధం అగ్ర నిర్మాత దిల్ రాజుకు అస్సలు బాగోలేదు అందుకే అతడు నిర్మించిన మూడు చిత్రాలు వరుసగా డిజాస్టర్ ల మీద డిజాస్టర్ లు అయ్యాయి . రాజ్ తరుణ్ తో చేసిన లవర్ జూలై లో విడుదలై ఘోర పరాజయం మూటగట్టుకుంది . దాని తర్వాత నితిన్ హీరోగా నిర్మించిన శ్రీనివాస కళ్యాణం కూడా విడుదలై ఘోర పరాజయం పొందింది . కట్ చేస్తే ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా హలో గురూ ప్రేమకోసమే చిత్రం కూడా ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది . దసరా సెలవుల పుణ్యమా అని ఈ మాత్రం వసూళ్లు వచ్చాయి లేదంటే హలో గురూ ప్రేమకోసమే చిత్రం కూడా డిజాస్టర్ అయ్యేది .

25 కోట్ల బిజినెస్ చేసిన హలో గురూ ప్రేమకోసమే చిత్రానికి ఇప్పటివరకు దాదాపుగా 18 కోట్ల షేర్ వచ్చింది దసరా సెలవులు కాబట్టి . ఇక సెలవులు అయిపోవడంతో వసూళ్లు లేవు దాంతో సక్సెస్ టూర్ అంటూ బయలుదేరారు . హీరో , హీరోయిన్ లు వస్తున్నారని తెలిసినా , ప్రచారం చేసినా ప్రేక్షకులు వాళ్ళని చూడటానికి ఎగబడుతున్నారు తప్పితే టికెట్ కొని సినిమా మాత్రం చూడటం లేదు దాంతో హ్యాట్రిక్ ఫ్లాప్ చిత్రాలను మూట గట్టుకున్నాడు దిల్ రాజు . గత ఏడాది వరుసగా ఆరు చిత్రాలను హిట్ చేసి పండగ చేసుకున్న దిల్ రాజు కు ఈ ఏడాది వరుసగా మూడు ఫ్లాప్ లు రావడం గమనార్హం .

English Title: Dil raju gets hattric flops