పవన్ ‘పింక్’ అవతారం ఎత్తుతాడా?


Pawan Kalyan
పవన్ ‘పింక్’ అవతారం ఎత్తుతాడా?

నిజాలు మాట్లాడుకుంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా చేయడానికి ఏం లేదు. ఒక రెండేళ్ల దాకా ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ మళ్ళీ సినిమాల్లోకి రావాలని నిర్మాతల సైడ్ నుండి ఒత్తిడి ఉంది. ముఖ్యంగా దిల్ రాజు పవన్ ను సినిమాల్లోకి తేవడానికి తన విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తను ఎక్కువ కష్టపడకుండా, డ్యాన్సులు అవీ లేకుండా చేసేలా ‘పింక్’ రీమేక్ ను ఆఫర్ చేసినట్లు సమాచారం. పైగా లాభాల్లో యాభై శాతం కూడా తీసుకోమంటున్నాడు. ఆఫర్ టెంప్టింగ్ గానే ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ సినిమాల వైపు వెళ్తే రాజకీయంగా తనను ఇబ్బంది పెడతారని పవన్ ఆలోచిస్తున్నాడు. ఒకవేళ పవన్ ఒప్పుకుంటే ఇప్పటికే అడ్వాన్స్ లు ఇచ్చిన ఏఎం రత్నం, మైత్రి మూవీ మేకర్స్ తమ సినిమాలు కూడా చేసేలా ఒప్పించాలని ఇప్పటినుండే ప్రణాళికలు వేసుకుంటున్నారు. మరి పవన్ ఏం డిసైడ్ అవుతాడో చూడాలి.