హీరో పరువు తీసిన దిల్ రాజు


dil raju insults hero raj tarunహీరో రాజ్ తరుణ్ పరువు ని తీసి పడేసాడు దిల్ రాజు , ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే రాజ్ తరుణ్ పై పీకల దాకా కోపం ఉన్నట్లు అర్ధం అవుతోంది . ఇంతకీ రాజ్ తరుణ్ పై ఈ అగ్ర నిర్మాతకు కోపం ఎందుకయ్యా అంటే లవర్ సినిమాని 8 కోట్లు పెట్టి తీయడమే ! గతకొంత కాలంగా రాజ్ తరుణ్ కు సక్సెస్ లేదు పైగా వచ్చిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందాయి దాంతో దిల్ రాజు కు ఎక్కడా లేని టెన్షన్ వచ్చేసింది అందుకే కాబోలు ఆ హీరో చులకన భావం ఏర్పడి ఉంటుంది . దిల్ రాజు కావాలని అదేపనిగా రాజ్ తరుణ్ ని విమర్శించలేదు కానీ ఆయన మాటల్లో మాత్రం రాజ్ తరుణ్ అంటే లెక్కలేదు .

రాజ్ తరుణ్ తో సినిమా అంటే 5 కోట్లే ఎక్కువ కానీ నేను 8 కోట్లు పెట్టి తీసా …… రాజ్ తరుణ్ సరసన నటించడానికి అగ్ర కథానాయికలు ఒప్పుకోరు అదో సమస్య , పైగా మా బ్యానర్ కో ఇమేజ్ ఉంది కాబట్టి చేయాల్సి వచ్చింది . ప్రతీ పాటకు ఓ సంగీత దర్శకుడి ని పెడతానని మా హర్షిత్ అన్నాడు రాజ్ తరుణ్ సినిమాకు అవసరమా ? అని అన్నాను ,అయినా రాజ్ తరుణ్ కు ఈ లవర్ కథ సరిపోతుంది కాబట్టి అతడికి మార్కెట్ లేకపోయినా ఇంత బడ్జెట్ పెట్టి తీసాం అంటూ అంతా చులకన చేసి మాట్లాడాడు దిల్ రాజు .

ఇక లవర్ సినిమా ఈనెల 20న విడుదల అవుతోంది దాంతో నిర్మాతకు టెన్షన్ పట్టుకుంది . సినిమా ఆడితే డబ్బులు వస్తాయి లేదంటే మొత్తం పోయినట్లే !

English Title: dil raju insults hero raj tarun