జెర్సీ డైరెక్టర్ ని బుట్టలో వేసుకున్నారు


జెర్సీ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన గౌతమ్ తిన్ననూరి ని బుట్టలో వేసుకున్నాడు నిర్మాత దిల్ రాజు . నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం ఈనెల 19 న విడుదలై సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే . హార్ట్ టచింగ్ గా ఉన్న ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురుస్తోంది . అలాగే స్టార్ హీరోలు సైతం దర్శకులు గౌతమ్ తిన్ననూరి పై ప్రశంసలు కురిపిస్తూ మంచి కథ దొరికితే తప్పకుండా చేద్దామని ఆఫర్లు ఇస్తుండటంతో వాళ్ళందర్నీ దాటేసి దిల్ రాజు ఈ దర్శకుడి ని తన బుట్టలో వేసుకున్నాడు జెర్సీ సక్సెస్ మీట్ అంటూ ఏర్పాటు చేసి .

నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఆవాస హోటల్ లో జెర్సీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసాడు దిల్ రాజు . ఈ సినిమాతో దిల్ రాజు కు సంబంధం లేదు కానీ మంచి హిట్ కాబట్టి అనే కోణంలో చేసాడు . కానీ తెరవెనుక మతలబు ఏంటంటే ……. గౌతమ్ తిన్ననూరి కి మంచి డిమాండ్ ఉంది కాబట్టి తన బ్యానర్ లో సినిమా చేసుకోవడానికి ఇలా కట్టి పడేసాడు అంతే ! జెర్సీ ఘనవిజయం సాధించడంతో గౌతమ్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది .