దిల్ రాజు స్ట్రాటజీ మిగతా నిర్మాతలకు ఆదర్శం


Dil Raju
దిల్ రాజు స్ట్రాటజీ మిగతా నిర్మాతలకు ఆదర్శం

అసలు నిలకడ లేని ఇండస్ట్రీగా సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇక్కడ జాతకాలు మారిపోతుంటాయి. సినిమా ఫలిత ప్రభావం అందరికన్నా ఎక్కువ నిర్మాతపైన పడుతుంది అన్నది అందరికీ తెల్సిన సత్యమే. అందుకే ఇక్కడ నిర్మాతగా నిలదొక్కుకోవాలంటే మాటలు కాదు. అయితే ఈ పనిని 15 ఏళ్లకు పైనే విజయవంతంగా చేస్తున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.

మారిన పరిస్థితులకు తగినట్లు తన పద్దతి మార్చుకోవడం దిల్ రాజు స్ట్రాటజీ. ఇదివరకు భారీ సినిమాలను సోలోగా నిర్మించే అలవాటున్న దిల్ రాజు, ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కేవలం మీడియం, లో బడ్జెట్ సినిమాలను పూర్తి కంట్రోల్ తో పూర్తి చేసే దిల్ రాజు, భారీ బడ్జెట్ చిత్రాలను మాత్రం వేరొక నిర్మాతతో కలిసి నిర్మిస్తున్నాడు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది అన్నది దిల్ రాజు భావన.