ప‌వ‌న్ సినిమా కూడా ఓటీటీకేనా?


ప‌వ‌న్ సినిమా కూడా ఓటీటీకేనా?
ప‌వ‌న్ సినిమా కూడా ఓటీటీకేనా?

క‌రోనా కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీ రూపు రేఖ‌లు, బిజినెస్ మొత్తం మారిపోతున్న వేళ ఇది. థియేట‌ర్స్ రీఓపెన్ కావ‌డం ఇప్ప‌ట్లో క‌ష్ట‌మ‌నే సంకేతాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో టాలీవుడ్‌లో గ‌త కొన్ని నెల‌లుగా రిలీజ్‌కు సిద్ధంగా వున్న సినిమాల‌న్నీ ఒక్కొక్క‌టిగా ఓటీటీ బాట‌ప‌డుతున్నాయి. ఇటీవ‌లే నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ `వి` చిత్రం ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో ఇదే బాట‌లో మ‌రి కొన్ని క్రేజీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.

తాజాగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా కూడా ఓటీటీ బాట‌ప‌డుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు, బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. క‌రోనా కార‌ణంగా షూటింగ్ మ‌ధ్య‌లో ఆగిపోయింది.

త్వ‌ర‌లోనే ప‌వ‌న్ ఓకే అంటే బ్యాలెన్స్ షూటింగ్‌ని పూర్తి చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇవ్వ‌మ‌ని ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ దిల్ రాజుకు భారీ ఆఫ‌ర్ ఇచ్చింద‌ని,చ ఆయితే ఆయ‌న ఆ ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించార‌ని తాజా స‌మాచారం.