దిల్ రాజు కు గట్టి దెబ్బే


dil raju shocked with srinivasa kalyanam resultఅగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ నుండి సినిమాలు వస్తున్నాయంటే అవి మినిమమ్ గ్యారెంటీ చిత్రాలని మంచి పేరుంది కానీ ఆ పేరు కి ఇప్పుడు మసక బారుతోంది . ఇటీవలే లవర్ సినిమాతో ఘోర పరాజయం పొందిన దిల్ రాజు తాజాగా శ్రీనివాస కళ్యాణం చిత్రంతో మరో ప్లాప్ ని మూట గట్టుకున్నాడు . ఆగస్టు 9న విడుదలైన శ్రీనివాస కళ్యాణం చిత్రం పై చాలా గొప్పలు చెప్పాడు , ఎక్కువ చేసి మరీ చూపించాడు . ఇక కలలో ఇలలో రాని సినిమా అంటూ చెప్పుకొచ్చాడు కట్ చేస్తే మొదటి రోజునే డివైడ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది .

దాంతో కలెక్షన్లు అటకెక్కాయి . ఈ సినిమా మూడు రోజుల్లో కనీసం నాలుగు కోట్ల షేర్ రాబట్టలేకపోయింది . ఇక ఈరోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు బాగానే ఉంటాయి అసలైన పరీక్ష రేపు ఎదురౌతోంది శ్రీనివాస కళ్యాణం చిత్రానికి . మొత్తం మీద ఈ సినిమా 6 కోట్ల షేర్ రాబడితే గొప్పే అని అంటున్నారు . అయితే గీత గోవిందం సినిమా ఫలితాన్ని బట్టి శ్రీనివాస కళ్యాణం వసూళ్లు ఆధారపడి ఉన్నాయి . ఎందుకంటే గీత గోవిందం బాగుంటే శ్రీనివాస కళ్యాణం కు గట్టి దెబ్బే ! ఒకవేళ గీత గోవిందం మామూలుగా ఉంటే తప్పకుండా శ్రీనివాస కళ్యాణం చిత్రానికి కలిసి వస్తుంది . అయితే ఇప్పటివరకైతే దిల్ రాజు కు ఈ సినిమా గట్టి దెబ్బే కొట్టింది . శ్రీనివాస కళ్యాణం పై భారీ ఆశలు పెట్టుకొని పిచ్చ హైప్ క్రియేట్ చేసాడు , గొప్పగా చెప్పాడు కట్ చేస్తే ఫలితం దారుణంగా ఉండటంతో షాకయ్యాడు దిల్ రాజు .

English Title: dil raju shocked with srinivasa kalyanam result

dil raju shocked with srinivasa kalyanam result