“అమృత to జాను” దిల్ జర్నీ


Dil Raju Sir Love Stories
Dil Raju Sir Love Stories

మనం వ్యాపారం చెయ్యాలంటే విలువల కంటే ముందు లెక్కలు గురించి ఆలోచించాలి. మంచి – చెడు ల గురించి తక్కువగా, లాభ నష్టాల మీద ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. లాభం తోపాటు రిస్క్ చాలా ఎక్కువగా ఉండే సినిమా ఫీల్డ్ లో క్రియేటివిటీ ని, ఎక్కువగా కమర్షియల్ లెక్కలు శాసిస్తూ ఉంటాయి. కాని చాలా తక్కువ మంది విలువలతో కూడిన, సమాజానికి ఉపయోగపడే కథలను సినిమాలుగా మలుస్తూ, వాటిని ఈ తరానికి అర్ధం అయ్యేటట్లు వినోదాత్మకంగా తీస్తారు. మళ్ళీ ఆ సినిమాల మేకింగ్ విషయంలో కూడా నాణ్యత ప్రమాణాలకు ఏ మాత్రం రాజీ పడకుండా సినిమాలను ఎదో తమ సొంత బిడ్డలుగా భావించినట్లు ఉంటుంది సదరు నిర్మాతల పద్ధతి. ప్రస్తుతం టాలీవుడ్ లో దిల్ రాజు అని పిలవబడే వెంకట రమణ రెడ్డి గారిది అదే వైఖరి.

సినిమా అంటే వ్యాపారం కంటే కూడా దిల్ రాజు గారికి సినిమా అంటే ఒక గౌరవం. ఒక ప్రేమ. ఒక తపన. సమాజానికి ఉపయోగపడే విషయం ఏదైనా సినిమా ద్వారా అయితేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుందనేనిజం ఆయనకు తెలుసు. ఇక గతంలో కూడా ఆర్య, పరుగు, ఓ మై ఫ్రెండ్, కొత్త బంగారు లోకం, మరో చరిత్ర, ఫిదా, ఇప్పుడు జాను లాంటి బెంచ్ మార్క్ లవ్ స్టోరీస్ ను మనకు అందించారు దిల్ రాజు గారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయ్యే జాను సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి, రాజు గారు లాంటి మేకర్ నుండి మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుందాం.