దిల్ రాజు గేమ్ ప్లాన్ టెర్రిఫిక్‌!


దిల్ రాజు గేమ్ ప్లాన్ టెర్రిఫిక్‌!
దిల్ రాజు గేమ్ ప్లాన్ టెర్రిఫిక్‌!

టాలీవుడ్‌లో వున్న స్టార్ ప్రొడ్యూస‌ర్‌ల‌లో తెలంగాణ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు పంథానే వేరు. డిస్డ్రిబ్యూట‌ర్‌గా , ఎగ్జిబిట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు `భార‌త్ బంద్‌`, పెళ్లిం చెబితే వినాలి` చిత్రాల న‌టుడు కాస్ట్యూమ్స్ కృష్ణ స‌హకారంతో డిస్ట్రిబ్యూట‌ర్‌గా స‌క్సెస్ అయ్యారు. `దిల్‌` చిత్రంతో నిర్మాత‌గా త‌న ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టిన ఆయ‌న త‌న అభిరుచికి త‌గ్గ సినిమాలు నిర్మిస్తూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుని ఇండ‌స్ట్రీలో స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు.

2003లో నిర్మాత‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు ఈ ప‌ద‌హారేళ్ల జ‌ర్నీలో అత్య‌ధిక విజ‌యాల్ని సొంతం చేసుకున్న నిర్మాత‌గా ఇండస్ట్రీలో టాప్ పొజిష‌న్ కు చేరుకున్నారు. డ‌బ్బింగ్ చిత్రాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 48 చిత్రాల్ని అందించారాయ‌న‌. ఇందులో కొన్ని ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌లిసి నిర్మించిన చిత్రాలు కూడా వున్నాయి. టేస్ట్ వున్న నిర్మాత‌గా ప‌లువురికి రోల్ మోడ‌ల్‌గా నిలిచిన దిల్‌రాజు తాజాగా త‌న పంథాను మార్చారు. తెలుగులో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌తో నిర్మించిన `ఎఫ్‌2` సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో నిర్మించ‌బోతున్నారు. దీంతో ఆయ‌న బాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతున్నారు.

అనీస్ బాజ్మీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమాతో బాలీవుడ్ బాట‌ప‌డుతున్న దిల్ రాజు ఇందు కోసం ఓ టెర్రిఫిక్ గేమ్ ప్లాన్‌ని రెడీ చేసుకున్నాడు. బోనీ క‌పూర్‌తో క‌లిసి `ఎఫ్‌2`ని బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్న దిల్ రాజు దీనితో పాటు `జెర్సీ` బాలీవుడ్ రీమేక్‌కు కూడా భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక హిందీ, త‌మిళ భాష‌ల్లో ఇప్ప‌టికే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `పింక్‌` తెలుగు రీమేక్‌లోనూ దిల్‌రాజు భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తూ మిగ‌తా నిర్మాత‌ల‌కి త‌న గేమ్ ప్లాన్‌తో దిమ్మ‌దిరిగే ట్విస్ట్ ఇస్తున్నాడు. ఎఫ్‌2, జెర్సీ చిత్రాలు దిల్ రాజుకు బాలీవుడ్‌లో మంచి పేరుని తెచ్చిపెట్ట‌డం ఖాయ‌మ‌ని ఈ విష‌యంలో ఆయ‌న గేమ్ ప్లాన్ అదిరింద‌ని ఫిలిం స‌ర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు.