ఈ సంక్రాంతి రియల్ విన్నర్ దిల్ రాజేనా?


Dil Raju the real sankranthi winner
Dil Raju the real sankranthi winner

దిల్ రాజు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్. నిర్మాతగా కాకపోయినా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సత్తా చాటుతుంటాడు. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలైతే నాలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కుల్లో దిల్ రాజుకు వాటా ఉంది. ఈ నాలుగు చిత్రాల నైజాం హక్కుల్ని రాజు గారే సొంతం చేసుకున్నారు. అలాగే సరిలేరు నీకెవ్వరు చిత్రానికి వైజాగ్ ఏరియాలో హక్కుల్ని కొనుక్కున్నారు. ఇక అల వైకుంఠపురములో చిత్రానికి సంబంధించి అల్లు అరవింద్ తో కలిసి వైజాగ్ ఏరియాలో చిత్రాన్ని పంపిణీ చేసారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రంపై దాదాపు 35 కోట్ల పెట్టుబడి పెట్టారు దిల్ రాజు. అలాగే అల వైకుంఠపురములో చిత్రం విషయానికొచ్చేసరికి 28 కోట్ల పెట్టుబడి పెట్టారు. అంటే ఈ చిత్రాలపై దిల్ రాజు ఏకంగా 60 కోట్ల కంటే ఎక్కువే రిస్క్ చేసారు. దీంతో ఒక సినిమా తీసుకోవచ్చు. అయితే దిల్ రాజు ఈ రెండు చిత్రాలపై భారీగానే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు ఈ రెండు ఏరియాల్లో దాదాపు 50 కోట్ల వరకూ వసూలు చేసింది. ఫుల్ రన్ పూర్తయ్యేసరికి మరో 5 కోట్ల దాకా వసూలు చేసే అవకాశాలున్నాయి. అంటే ఖర్చులన్నీ తీసేసినా కూడా ఈ చిత్రంపై దాదాపు 12 కోట్ల దాకా ప్రాఫిట్స్ వచ్చాయి మన అగ్ర నిర్మాతకి.

ఇక అల వైకుంఠపురములో కూడా ఈ రెండు ఏరియాల హక్కుల్ని కలుపుకుని 25 కోట్ల దాకా ప్రాఫిట్స్ ను అందుకోనున్నట్లు వినికిడి. ఇతరత్రా ఖర్చులన్నీ పోయినా కూడా ఈ రెండు చిత్రాల ద్వారా 35 కోట్ల దాకా లాభాలు వెనకేసుకున్నారు రాజు గారు. అయితే దర్బార్, ఎంత మంచివాడవురా చిత్రాల ద్వారా కొంత నష్టాలను మూటగట్టుకుకోక తప్పట్లేదు. ఏది ఎలా చూసినా ఈ సంక్రాంతి ద్వారా దిల్ రాజు ఆదాయం 30 కోట్లకు అటూ ఇటూగా ఉండనుందని సమాచారం. డైరెక్ట్ గా సినిమా రిలీజ్ లేకపోయినా దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సంక్రాంతికి చక్రం తిప్పడం జరిగింది.