ఏడాదిలో మూడు రీమేక్ లు. దిల్ రాజు స్ట్రాటజీ ఏంటో!


Dil raju three remakes in one year
Dil raju three remakes in one year

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి కొన్ని కొన్ని విషయాలంటే ఇష్టం ఉండదు. వారి అభిరుచుల ప్రకారమే సినిమాలు తీసుకుంటూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి రీమేకులు అంటే పడదు. చూసిన చిత్రాన్ని మళ్ళీ చేస్తే ఎగ్జైట్మెంట్ ఉండదని ఫీలవుతాడు మహేష్. అందుకే తన 26 సినిమాల్లో ఒక్క రీమేక్ కూడా లేదు. ఇదే కోవలోకి చెందుతారు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా. తమ చిత్రాలు ఏవీ రీమేక్స్ లేకుండా జాగ్రత్తపడ్డారు. నిర్మాతల విషయానికి దిల్ రాజు కూడా తన కెరీర్ మొదటి నుండి ఇదే ఫీలయ్యాడు. దిల్ రాజు ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు పూర్తయింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసాడు కానీ ఒక్క సినిమాను కూడా రీమేక్ చేయలేదు. అయితే 2020లో మాత్రం దిల్ రాజు స్ట్రాటజీ మార్చాడు. ఈ ఏడాదే దిల్ రాజు నిర్మించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయి.

ముందుగా దిల్ రాజు నిర్మించిన ఫస్ట్ రీమేక్ జాను. 96 చిత్రాన్ని చెన్నై వెళ్లి చూసొచ్చి, తెగ నచ్చేయడంతో తన నియమాన్ని పక్కన పెట్టేసి నిర్మించాడు. ఈ చిత్రం మరొక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా మళ్ళీ సినిమాల్లోకి రప్పించాలన్న ఉద్దేశంతో పింక్ రీమేక్ బాధ్యతలను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం మే 15న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ రెండూ కాకుండా ఒక తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. తెలుగులో గతేడాది విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన జెర్సీ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే కబీర్ సింగ్ రీమేక్ తో తిరిగి హిట్ ట్రాక్ లో పడ్డ షాహిద్, జెర్సీ రీమేక్ తో మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

ఇలా ఒకే ఏడాది మూడు రీమేక్ లు చేయడం పట్ల దిల్ రాజు స్ట్రాటజీ ఏంటో అని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.