`కేజీఎఫ్2` దిల్ రాజు చేతుల్లోకి వ‌చ్చేస్తోందా?


`కేజీఎఫ్2` దిల్ రాజు చేతుల్లోకి వ‌చ్చేస్తోందా?
`కేజీఎఫ్2` దిల్ రాజు చేతుల్లోకి వ‌చ్చేస్తోందా?

క‌న్న‌డ రాక్‌స్టార్ య‌ష్ న‌టించిన `కేజీఎఫ్‌` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ మూవీ రాత్రికి రాత్రే య‌ష్‌తో పాటు డైరెక్ట‌ర్ ని కూడా పాన్ ఇండియా స్థాయిలో పాపుల‌ర్ అయ్యేలా చేసింది. ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా `కేజీఎఫ్ 2` రూపొందుతున్న విష‌యం తెలిసిందే. తొలి భాగానికి మించి భారీ హంగుల‌తో రూపొందుతున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

దీంతో  చిత్రానికి రిలీజ్‌కి ముందే భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఆ డిమాండ్‌కి త‌గ్గ‌ట్టే రిట‌ర్న్స్‌ని రాబ‌ట్టి కోవాలని డిస్ట్రీ బ్యూట‌ర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు రీఓపెన్ కావ‌డంతో ఈ మూవీ టిక్కెట్ రేట్‌ని మినిమ‌మ్ 200గా డిసైడ్ చేయాల‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరాయ‌ట‌. ఇందుకు ప్ర‌భుత్వం కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఈ చిత్ర ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌ద‌ర్శ‌న హ‌క్కుల్ని దిల్ రాజు దాదాపు 70 కోట్లుకు ద‌క్కించుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక‌వేళ ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాల్ని అందుకోలేక‌పోతే ఆ న‌ష్టాన్ని మాత్రం హోంబ‌లే ఫిలింస్ మేక‌ర్స్ భ‌రించాల్సిందే అనే ఒప్పందంతో ఈ చిత్రాన్ని ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజ‌మైతే దిల్ రాజు పంట‌పండిన‌ట్టే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.