ఎవడు రీమేక్ తో హిట్ కొడతాడా ?


Dil Raju Yevadu RemakeDil Raju
Dil Raju Yevadu Remake

తెలుగులో అగ్రశ్రేణి నిర్మాతగా చెలామణి అవుతున్నాడు దిల్ రాజు . అయితే ఇక్కడే సినిమాలు తీసుకుంటూ హిట్స్ కొట్టక తాజాగా బాలీవుడ్ లో కూడా జెండా పాతాలని చూస్తున్నాడు . రాంచరణ్ ,అల్లు అర్జున్ , కాజల్ అగర్వాల్ , అమీ జాక్సన్ , శృతి హాసన్ లు నటించిన ఎవడు చిత్రాన్ని ఇన్నాళ్లకు హిందీలో రీమేక్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాడు . 2014 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది .

అయితే తెలుగులోనే చిత్రాలు చేస్తూ హిందీ లేదా ఇతర బాషలలో సినిమాలు చేద్దామని రీమేక్ చేద్దామని వెళ్లిన వాళ్లలో చేతులు కాల్చుకున్న నిర్మాతలే ఎక్కువ మంది ఉన్నారు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఆర్ధికంగా చితికిపోయారు కూడా . ఈ విషయాలన్నీ దిల్ రాజు కు తెలుసు కానీ సినిమా మీద నమ్మకంతో ఓ ప్రయోగం చేస్తున్నాడు మరి ఈ రీమేక్ తో హిట్ కొడతాడా ? లేక దెబ్బతింటాడా ? చూడాలి .