కంగ‌న‌కు గాయ‌కుడికి మ‌ధ్య మాట‌ల యుద్ధం!

కంగ‌న‌కు గాయ‌కుడికి మ‌ధ్య మాట‌ల యుద్ధం!
కంగ‌న‌కు గాయ‌కుడికి మ‌ధ్య మాట‌ల యుద్ధం!

వివాదం ఎక్క‌డ వుంటే అక్క‌డ కంగ‌న వుంటోంది. దాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఇటీవ‌ల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మృతిపై అన‌వ‌స‌ర రార్థాంతం చేసిన కంగ‌న ఆ ఇష్యూని త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ప‌తాక శిర్షిక‌ల్లో నిలిచింది. ఈ వివాదం కార‌ణ‌ఫంగా మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేని టార్గెట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

తాజాగా మ‌రోసారి త‌న‌కు సంబంధింలేని ఇష్యూలో త‌ల‌దూర్చి వివాదం సృష్టిస్తోంది. రేంద్ర ప్ర‌వేశ పెట్టిన వ్య‌వ‌సాయ బిల్లుని వ్య‌తిరేకిస్తూ పంజాబ్‌కు చెందిన రైతు సంఘాలు ఢిల్లీలో ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌జ‌రుగుతుంటే కంగ‌న మాత్రం అందులోనూ త‌న‌కు కావాల్సిన వివాదాన్ని వెతుక్కుంది. రైతుల ఆందోళ‌న‌లో పాల్గొన్న ఓ వృద్ధురాలిని ఉద్దేశిస్తూ త‌ప్పుగా ట్వీట్ చేసింది. షాహీన్ బాగ్ బామ్మ రూ.100 ఇస్తే చాలు ఇలాంటి ఆందోళ‌న‌కు వ‌చ్చేస్త‌ర‌ని వివాదాస్ప‌దంగా ట్వీట్ చేసింది. దీనిపై నెటిజ‌న్స్ చుర‌క‌లు అంటించ‌డంతో వెంట‌నే డిలిట్ చేసింది.

ఈ ట్వీట్‌పై ప‌లువురు సెల‌బ్రిటీలు కంగ‌న‌కు చుర‌క‌లు అంటించారు. పంజాబ్ సింగ‌ర్‌, న‌టుడు దిల్జిత్ దొసాంజే కూడా కంగ‌న‌పై ఫైర‌య్యాడు. కంగ‌న కూడా దుల్జిత్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం వివాదంగా మారింది. `నువ్వు క‌ర‌ణ్‌జోహార్ పెంపుడు జంతువు. పౌర‌చ‌ట్టం కోసం ఆందోళ‌న చేసిన ఆ బామ్మే ఇప్పుడు రైతుల కోసం నిర‌స‌న చేస్తోంద‌ని మాత్ర‌మే తాను ట్వీట్ చేశాన‌ని ఇప్పుడు ఈ డ్రామా ఏంటి? అని ప్ర‌శ్నించింది. కంగ‌న ట్వీట్‌కు ఆగ్ర‌హించిన దిల్జిత్ టెర్రిఫిక్ రిప్లై ఇచ్చారు. `ఎవ‌రితో అయితే నువ్వు క‌లిసి ప‌నిచేశావో వారంద‌రికీ నువ్వు పెంపుడు జంతువేనా? అలా అయితే ఆ జాబితా పెద్ద‌దే అవుతుంది. ఇది బాలీవుడ్ కాదు పంజాబ్‌. మ‌నుషుల భావోద్వేగాల‌తో ఎలా ఆడుకోవాలో నీకు బాగా తెలుసు` అని ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చాడు. దీంతో దిల్జిత్‌ని ఉగ్ర‌వాదిగా పోలుస్తూ కంగ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.