హీరోలకు చురకలు అంటించిన ఆర్ ఎక్స్100 డైరెక్టర్


director ajay bhupathi sensational comments on telugu heroes

దర్శకుడు ఎంతో ఆలోచించి కథ రెడీ చేసుకుంటాడని , కానీ అతడు కథ చెప్పడానికి వస్తే హీరోలు కథ వినకుండా వాళ్ళ మేనేజర్ నో లేదంటే పీఏ నో వినమని చెబుతుంటారని అది సరైన విధానం కాదని అందుకే హీరోలకు చాలా మంచి సినిమాలు రాకుండా పోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి . హీరోల్లారా మీకు సమయం లేకపోతే కథ వింటామని చెప్పి మీ వాళ్ళని వినమని చెప్పకండి సమయం ఉన్నప్పుడే వినండి లేదంటే కథలు వినడం మానేయండి అంటూ చురకలు అంటించాడు .

ఆర్ ఎక్స్ 100 తో సంచలన విజయాన్ని అందుకున్నాడు ఈ దర్శకుడు . ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు . అసలు విషయం ఏంటంటే ఈ దర్శకుడు ఆర్ ఎక్స్ 100 కథ ని తీసుకొని ముందుగా విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్ళాడు , అయితే విజయ్ దేవరకొండ నటించలేదు దాంతో సుధీర్ బాబు దగ్గరకు వెళ్ళాడట ! అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది దాంతో విసుగు చెంది కొత్త కుర్రాడు కార్తికేయ తో చేసాడు బ్లాక్ బస్టర్ కొట్టాడు . అజయ్ భూపతి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కానీ ఆర్ ఎక్స్ 100 హిట్ కావడంతో పొగరుతో అంటున్నాడు అని దుమారం రేపే వ్యక్తులు కూడా ఉంటారు మరి .

English Title: director ajay bhupathi sensational comments on telugu heroes