`పిల్ల జ‌మీందార్` డైరెక్ట‌ర్‌కి మ‌రో ఆఫ‌ర్‌!‌


`పిల్ల జ‌మీందార్` డైరెక్ట‌ర్‌కి మ‌రో ఆఫ‌ర్‌!‌
`పిల్ల జ‌మీందార్` డైరెక్ట‌ర్‌కి మ‌రో ఆఫ‌ర్‌!‌

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన `పిల్ల జ‌మీందార్` చిత్రం అనూహ్య విజ‌యాన్ని సాధించిన వియం తెలిసిందే. కొరియ‌న్ ఫిల్మ్ ఆధారంగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు అశోక్ తెర‌కెక్కించారు. కొంత విరామం త‌రువాత అశోక్ కి `భాగ‌మ‌తి` రూపంలో మ‌రో బిగ్ హిట్ ల‌భించింది. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించింది.

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌స్తుతం హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా అశోక్ బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. `దుర్గావ‌తి` పేరుతో రీమేక్ అవుతున్నఈ చిత్రాన్నివిక్ర‌మ్ మ‌ల్హోత్రా, టిసిరీస్ భూష‌ణ్‌‌కుమార్‌, హీరో అక్ష‌య్‌కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. భూమి ప‌డ్నేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబ‌ర్ 11న రిలీజ్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత అశోక్‌కు మ‌రో ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టు తెలిసింది. సైలెంట్ ఫిల్మ్‌గా థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌. ఈ చిత్రానికి `ఉఫ్‌` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు. బాలీవుడ్ హటీస్ నుస్ర‌త్ బారుచా, బాహుబ‌లి ఫేమ్ నోరా ఫ‌తే న‌టించ‌బోతున్నారు. ద‌ర్శ‌కుడు ల‌వ్ రంజ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి ప్రారంభించ‌బోతున్నారు.