మద్యం మత్తులో కారుని గుద్దేసి పారిపోయిన డైరెక్టర్

director bobby car rams another faces drunk and drive ఈనెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చాడు ఎన్టీఆర్ కాగా ఆ పార్టీలో మద్యం సేవించిన యువ దర్శకులు బాబీ వేగంగా వచ్చి ఓ కారుని గుద్దేసి అక్కడి నుండి పారిపోవడం సంచలనం గా మారింది . కాగా ఈ విషయాన్నీ సదరు కారు యజమాని ట్వీట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది . అర్ధరాత్రి వేగంగా వచ్చి నా కారుని గుద్దేసి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని పైగా పక్కనే మా ఇల్లు ఉంది వెళ్లి అక్కడ మా ట్లాడుకుందాం అని చెప్పి టక్కున కారు ఎక్కేసి పారిపోయాడని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు హర్మీందర్ సింగ్ అనే వ్యాపారి .

ఈ సంఘటన జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబర్ 33 లో జరిగిందట ! దర్శకుడు బాబీ తన కారుని గుద్డసి పారిపోవడంతో పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాడు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన ” జై లవకుశ ” చిత్రానికి దర్శకుడు ఈ బాబీ . రవితేజ తో కూడా సినిమా చేసాడు . ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీ లో పాల్గొని ఆ మత్తులో వేగంగా వచ్చి కేసులో ఇరుక్కున్నాడు . అయితే పెద్దగా గాయాలు కాలేదు , కారు కూడా స్వల్పంగానే దెబ్బతింది కాబట్టి రాజీ కొచ్చే ఛాన్స్ ఉంది .