ప‌వ‌ర్‌స్టార్ చిత్రంలో ఇస్మార్ట్ శంకర్ !ప‌వ‌ర్‌స్టార్ చిత్రంలో ఇస్మార్‌శంక‌ర్‌!
ప‌వ‌ర్‌స్టార్ చిత్రంలో ఇస్మార్‌శంక‌ర్‌!

పార్టీ కార్య‌కలాపాల్లో గ‌త రెండేళ్లుగా బిజీగా వుంటూ వ‌చ్చిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజాగా మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. `పింక్‌` రీమేక్ చిత్రంలో న‌టిస్తున్న ఆయ‌న వ‌రుస‌గా నాలుగు చిత్రాల‌ని లైన్‌లో పెట్టారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే క్రిష్ జాన‌ప‌ద చిత్రానికి ఓకే చెప్పేశారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జెట్ స్పీడుతో సాగుతోంది. పాన్ ఇండియా స్థాయికి ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ సినిమా కోసం హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో మూడు భారీ సెట్‌ల‌ని కూడా సిద్ధం చేశారు. ఇదిలా వుంటే హ‌రీష్‌శంక‌ర్ డైరెక్ష‌న్‌లోనూ ప‌వ‌న్ మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించి షాకిచ్చారు. ఇదే వ‌రుస‌లో బాబితో ఓ సినిమా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కోన వెంక‌ట్ ఆ చిత్రాన్ని నిర్మించాల‌ని ప్లాన్ చేసి స్టోరీ లైన్‌ని ప‌వ‌న్‌కు వినిపించార‌ట‌. అయితే లైన్ న‌చ్చ‌క‌పోవ‌డంతో ప‌వన్ ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశార‌ని తెలిసింది. ఇప్పుడు అదే స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్ది ఇస్మార్ట్ ఎన‌ర్జిటిక్‌ హీరో రామ్‌కు వినిపించార‌ట‌.

స్టోరీ న‌చ్చ‌డంతో రామ్ వెంట‌నే బాబీకి గ్రిన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం రామ్ `రెడ్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. కిషోర్ తిరుమ‌ల రూపొందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ఇది పూర్తియిన త‌రువాతే బాబీ సినిమా సెట్స్ పైకి వ‌స్తుంద‌ని, దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని త్వ‌ర‌లోనే చిత్ర బృందం వెల్ల‌డించ‌నున్నార‌ని తెలిసింది.