మలయాళ రీమేక్ దర్శకుడి పేరు ఖరారయిందిగా


మలయాళ రీమేక్ దర్శకుడి పేరు ఖరారయిందిగా
మలయాళ రీమేక్ దర్శకుడి పేరు ఖరారయిందిగా

గత కొంత కాలం నుండి ఎక్కడ చూసినా ఒక మలయాళ రీమేక్ గురించి వార్తలు బాగా రావడం మొదలైంది. లాక్ డౌన్ కు ముందు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుంది. అప్పటినుండి ఈ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంటూ వస్తోంది. ముందుగా ఈ సినిమాలో ఒక హీరోగా నందమూరి బాలకృష్ణ నటిస్తాడని అన్నారు. అయితే ఆ వార్త నిజం కాదని తేలిపోయింది. ఆ తర్వాత నుండి కూడా పలువురి హీరోల పేర్లు పరిశీలనలోకి వచ్చినా ఏదీ ఫైనల్ కాలేదు.

చివరికి రానా, రవితేజ ఈ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. అయితే కథలో మార్పులు నచ్చితేనే నటిస్తామని వారు చెప్పారట. ఇక దీంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించగల దర్శకుడు ఎవరా అన్న ఆరా మొదలైంది. హరీష్ శంకర్, సుధీర్ వర్మ అంటూ కొందరి పేర్లు వచ్చినా వారు చేయట్లేదని తేలిపోయింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ఈ దర్శకుడు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేస్తున్నాడట. మరికొద్ది వారాల్లో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలుస్తోంది.