హీరోగా మారుతున్న పెళ్ళిచూపులు డైరెక్టర్


director dasyam tarun bhascker turned hero

పెళ్ళిచూపులు చిత్రానికి దర్శకత్వం వహించి సంచలనం సృష్టించిన దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ తాజాగా హీరోగా మారుతున్నట్లు తెలుస్తోంది . ఇక తరుణ్ ని హీరోగా మార్చేది ఎవరో తెలుసా ……. రౌడీ విజయ్ దేవరకొండ . ఇటీవలే కింగ్ ఆఫ్ హిల్స్ అనే బ్యానర్ ని విజయ్ దేవరకొండ ప్రారంభించిన విషయం తెలిసిందే . ఆ బ్యానర్ పై వరుసగా చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నాడు విజయ్ దేవరకొండ . తనని పెళ్ళి చూపులు చిత్రంతో హీరోగా నిలబెట్టిన దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ అంటే విజయ్ కి అంతులేని ప్రేమ అందుకే తరుణ్ భాస్కర్ ని హీరోగా చేసి ఒక సినిమా నిర్మించాలని తహతహలాడుతున్నాడట .

పెళ్ళిచూపులు చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఈ నగరానికి ఏమైంది అనే చిత్రం చేసాడు దాస్యం తరుణ్ భాస్కర్ . అయితే ఆ సినిమా పరాజయం పొందింది దాంతో కసిగా మూడో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఒకవైపు దర్శకుడిగా సత్తా చాటాలని భావిస్తున్న ఈ తరుణంలో హీరోగా సినిమా చేయాలనీ విజయ్ దేవరకొండ భావించడం విశేషమే మరి . దీనికి దాస్యం తరుణ్ భాస్కర్ ఒప్పుకుంటాడా ? అన్నది చూడాలి .

English Title: director dasyam tarun bhascker turned hero