డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ అమీగ మ్యూజిక్ వీడియో


డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ అమీగ మ్యూజిక్ వీడియో ఆరు భాషలలో విడుదల
డాక్టర్ ఆనంద్ రచన దర్శకత్వంలో స్కూల్స్ మరియు కళాశాలలో జరిగే ర్యాగింగ్ మరియు బుల్లీయింగ్ కథాంశంతో అమెరికాలో అద్భుతమైన డాన్స్ ప్రదర్షణలు చేసి ఎన్నో అవార్డ్ లు సొంతం చేసుకున్న త్రిశూల్ కలాపురం అనే యువకుడిని పరిచయం చేస్తూ, బిగ్ బాస్ ఫేం తారిక మరియు మహర్షి, రాజా ది గ్రేట్,చల్ మోహన రంగ,సాక్ష్యం , ఫలక్ నామా దాస్ ఫేం హాసిని ప్రధాన పాత్రలతో శ్రీమతి పద్మా కలాపురం నిర్మాతగా,యన్ యస్ నాయక్ సమర్పణలో రూపొందిన డాన్స్ మ్యూజికల్ వీడియో అమీగ.
ఉగాది పర్వదినాన ఆరవ తేది ,సాయంత్రం ఆరు గంటలకు ఆరు భాషలలో షడ్రుచుల సమ్మేళనంగా రూపొందిన ఈ అమీగ యూ ట్యూబ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న బాల నటి హాసిని ,ఇందులో మనసుకు హత్తుకునే పాత్రను పోషించడం విశెషం.
అమీగ పాటను ప్రముఖ వర్ధమాన రచయిత శ్రీనివాస మౌళి రచించగా,తెలుగులో ఇండియన్ ఐడల్ రేవంత్, ఇంగ్లీష్ లో స్వీకర్ అగస్తి పాడడం విశేషం.
కిరణ్ మాస్టర్ కొరియోగ్రఫి,డాక్టర్ ఆనంద్ దర్శకత్వ ప్రతిభ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ .
ఆ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ, త్రిశూల్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడని,అందమైన తారిక,హాసిని లు అదనపు ఆకర్షణగా ఈ పాటను గోవా, ఓక్రిడ్జ్ మరియు ఆంబిటస్ స్కూల్స్ లో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా రూపొందించామని ,ప్రతి ఒక్కరూ ఈ వీడియో ని చూసి అమీగ టీం అందరిని ఆశీర్వదించాలని కోరారు.
ఈ వీడియో ప్రముఖ మ్యూజిక్ సంస్థ లహరి మ్యూజిక్ ద్వారా విడుదలయింది.