డైరెక్టర్ గోపీచంద్ తండ్రి మృతి

Gopichand-Malineni-And-His-Father
Gopichand-Malineni-And-His-Father

ప్రముఖయువ దర్శకులు గోపీచంద్ మలినేని తండ్రి మలినేని వెంకటేశ్వర్లు చౌదరి నిన్న సాయంత్రం ఒంగోలు లో మరణించాడు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు చౌదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు . వెంకటేశ్వర్లు చౌదరి స్వగ్రామం బొద్దులూరి వారి పాలెం కాగా అక్కడే నివసిస్తున్నారు గోపీచంద్ తండ్రి .

గోపీచంద్ తండ్రి మరణించారన్న వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు . తెలుగులో పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు గోపీచంద్ మలినేని . డాన్ శీను , పండగ చేస్కో , బలుపు , బాడీగార్డ్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు గోపీచంద్ మలినేని . తండ్రి మరణంతో గోపీచంద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది .