క‌దిలిస్తున్న డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ పోస్ట్‌!


క‌దిలిస్తున్న డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ పోస్ట్‌!
క‌దిలిస్తున్న డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ పోస్ట్‌!

క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని క‌మ్మేయ‌బోతున్న వేళ స‌డెన్‌గా ప్ర‌దాని మోదీ జ‌న‌తా క‌ర్ఫ్యూకి పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత రోజు నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నామంటూ ప్ర‌క‌టించారు. కానీ జ‌న‌తా క‌ర్ఫ్యూకి రెండు రోజుల ముందు దేశ వ్యాప్తంగా వున్న వ‌ల‌స కార్మికుల్ని సొంత ఊళ్ల‌కు ప‌య‌నం కావాల‌ని కేంద్ర ఒక్క మాట చెబితే వేళ ప్రాణాలు ఆహా కారాలు చేయాల్సిన దుస్థితి వ‌చ్చేది కాదు. స‌డెన్‌గా లాక్‌డౌన్ విధించ‌డం.. జ‌న‌జీవితం ఎక్క‌డిక‌క్క‌డే స్థంభించిపోవ‌డంతో పొట్ట చేత ప‌ట్టుకుని ప‌ట్నం బాట ప‌ట్టిన బ‌డుగు జీవి బ‌స్సులు, రైళ్లు స‌మ‌స్త ర‌వాణా బంద్ కావ‌డంతో త‌న కాళ్ల‌నే చ‌క్రాలుగా మ‌లుచుకుని త‌న గ‌మ్యం చేరుకోవ‌డం కోసం బ‌క్క‌చిక్కిన బ‌డుగుజీవి ఇంటికి ప‌య‌న‌మ‌య్యాడు.

ర‌క్త‌మోడుతున్న కాళ్లు ఈ పాపం ఎవ‌రిద‌ని ప్ర‌శ్నిస్తున్నాయి. ఆక‌లితో మాడుతున్న డొక్క బ‌డుగు జీవంటే వ్య‌వ‌స్థ‌కు ఎందుకింత చుల‌క‌న భావం అని ఆక్రోశిస్తోంది. ఇంటికి.. కంటికి దూరం ఎంత న‌డిచినా త‌ర‌గ‌క‌పోవ‌డంతో పంటి బిగువున బాధ‌ని దిగ‌మింగుతూ ఇంటికోసం వెతుకుతున్న క‌ళ్లు క‌న్నీళ్ల‌కు బ‌దులు ర‌క్త‌క‌న్నీరు కారుస్తున్నాయి. ఎవ‌రిదీ పాపం.. ఎందుకు మాకీ భారం అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి. ఓటు వేసి అంద‌ల‌మెక్కించినందుకు ప్ర‌భుత్వాలు వేసిన శిక్షా… లేక బ‌డుగు జీవిగా పుట్టినందుకు దేవుడు విధించిన శిక్షా.. అని త‌న‌లో త‌నే ..త‌న‌నే త‌ట్టుకుంటూ నిందించుకుంటూ వ‌ల‌స జీవి ఇంటి దారి పట్టాడు.

వ‌ల‌స కార్మికుల వెత‌ల‌కు చ‌లించిన ఎంతో మంది వారి ద‌య‌నీయ స్థితికి క‌న్నీరు పెడుతున్నారు. మాట‌ల్లో పాటల్లో త‌మ బాధ‌ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే త‌ర‌హాలో ద‌ర్శ‌కుడు హ‌రీష్‌శంక‌ర్ వ‌ల‌స కార్మికుల‌పై రాసిన లేఖ ప‌లువురిని ఉద్వేగానికి గురిచేస్తోంది.

“ బండ‌రాళ్ల‌ను పిండి చేసిన చేతులు
ఎడ‌మ ప‌క్క డొక్క నొప్పికి లొంగిపోయాయి
పెద్ద పెద్ద ఇనుప చువ్వ‌ల‌ను వంచిన వేళ్లు
మెత్త‌‌ని పేగుల ముందు ఓడిపోయాయి
మేం వేసిన రోడ్లే మ‌మ్మ‌ల్ని వెక్కిరిస్తుంటే
బ‌త‌క‌డం కోసం ఊరొదిలొచ్చిన మేము
చ‌చ్చేలోపు ఊరెల్తే చాల‌నుకుంటూ
ఆక‌లి అడుగుల‌తో…
పేగుల అరుపుల‌తో…
క‌ళ్లూ క‌డుపూ ఒకేసారి కాలుతుంటే…
మ‌మ్మ‌ల్ని చూసే లోకుల‌కు
బాధేస్తోంది.
జాలేస్తోంది.
కానీ మాకు మాత్రం `ఆక‌లేస్తోంది`!!
నిస్స‌హాయ‌త‌తో..

– హ‌రీష్‌శంక‌ర్‌