రైతు బంధు పధకంలో హరీష్ శంకర్


Director Harish Shankar Participates in Raithu Bandhu Programకమ్మదనం గ్రామం లో తనకు ఉన్న భూమికి గాను ప్రభుత్వం వారు ఇచ్చిన రైతుబంధు పధకం ఫలాన్ని సినీ దర్శకుడు హరీష్ శంకర్ ఎవరన్నా పేద రైతు సహయార్ధం వాడమని తిరిగి ఇచ్చేసారు. స్థానిక MLA సమక్షం లో గ్రామ సర్పంచ్ కి అందచేస్తూ హరీష్ శంకర్ గారు “తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పధకం ఎంతో ఉన్నతమైనది.

 

దీని ఫలితం గా నాకు ఉన్న పొలానికి కూడా కొంత మొత్తం వచ్చింది. ఎవరన్నా పేద రైతు సహయార్ధం ఇది వాడితే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశము తో ఈ మొత్తానికి మరికొంత జోడించి నేను సర్పంచ్ గారికి బాధ్యతాయుతం గా అందచేస్తున్నాను” అని అన్నారు.