ఒక‌రి చావు నాకు బోలెడు రిలీఫ్ ఇస్తుంది..!


ఒక‌రి చావు నాకు బోలెడు రిలీఫ్ ఇస్తుంది..!
ఒక‌రి చావు నాకు బోలెడు రిలీఫ్ ఇస్తుంది..!

2012..డిసెంబ‌ర్ 16న దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన అమాన‌వీయ ఘ‌ట‌న నిర్భ‌య సంఘ‌ట‌న‌. నిర్భ‌య‌ని ఆరుగురు క్రూర మృగాళ్లు అత్యంత పాశ‌వికంగా అత్యాచారం చేయ‌డం.. ఆసంఘ‌ట‌న త‌రువాత చికిత్స పొందుతూనే నిర్భ‌య మృతి చెందిన సంఘ‌ట‌న దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. ఢిల్లీ యువ‌త ఒక్క‌సారిగా రోడ్ల‌పైకి వ‌చ్చి నిర్భ‌య‌కు న్యాయం చేయాల‌ని, దోషుల్ని క‌ఠినంగా శిక్షించాల‌ని దిక్కులు పిక్క‌టిల్లేలా నిన‌దించింది.

అయినా న్యాయం జ‌ర‌గ‌లేదు. కింది కోర్టు, పై కోర్టు అంటూ కాల‌యాప‌న జ‌రుగుతూనే వ‌చ్చింది. అయినా నిర్భ‌య త‌ల్లిలో స‌హనం చ‌చ్చిపోలేదు. హంత‌కుల‌ని ఉరికంబం ఎక్కించేంత వ‌ర‌కు భ‌యప‌డ‌న‌ని, ఎలాంటి బెదిరింపుల‌కు లొంగ‌న‌ని శ‌ప‌థం చేసిన ఆ త‌ల్లి చివ‌రి దాదాపు ఏడేళ్ల నిరీక్ష‌ణ‌కు ఫ‌లితం ల‌భించింది. నిర్భ‌య దోషుల‌కు శుక్ర‌వారం ఉరిశిక్ష‌ని అమ‌లు చేసింది. దీనిపై స‌ర్వ‌త్రా హ‌ర్ష‌తిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్శ‌కులు హ‌రీష్ శంక‌ర్ త‌న‌దైన స్టైల్లో స్పందించారు. ఒక‌రి చావు త‌న‌కు బోలెడు రిలీఫ్‌ని ఇస్తుంద‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని, అలాగే కొంత మందికి భ‌యాన్నిస్తే చాలని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హ‌రీష్‌శంక‌ర్ త్వ‌ర‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా చేమోతున్న విష‌యం తెలిసిందే. `గ‌బ్బ‌ర్‌సింగ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మళ్లీ ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తోంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి స్క్రిప్ట్‌ని ఫైన‌ల్ చేసే ప‌నిలో వున్నారు.

Credit: Twitter