కుర్ర డైరెక్టర్ కు కొవ్వు ఎక్కువే !


Director indrasena controversial post on reviews

ఇటీవలే వీర భోగ వసంతరాయలు అనే చిత్రానికి దర్శకత్వం వహించిన కుర్ర డైరెక్టర్ ఇంద్రసేన కు కొవ్వు ఎక్కువే అనుకుంటా ఎందుకంటే రివ్యూ లు ఘోరంగా రావడంతో రివ్యూ రైటర్ లను అవమానిస్తూ ఓ ట్వీట్ చేసాడు . రివ్యూ లు సరిగా రాలేదు , రాయలేదు అనుకుందాం , సినిమా బాగానే ఉందని అనుకుందాం అప్పుడు ప్రేక్షకులకు నచ్చాలి కదా ! సినిమా బాగుంటే , ప్రేక్షకులకు నచ్చితే హీరో ఎవరు ? దర్శకుడు ఎవరు ? అన్నది చూడరు హిట్ చేసి చూపిస్తారు . కానీ వీర భోగ వసంతరాయలు సినిమా ఘోరంగా ఉండటంతో ఆ సినిమాని చూడటానికి ఎవరూ సాహసించలేదు ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళు చెత్త సినిమా అంటూ ప్రచారం చేసారు కాబట్టి .

రివ్యూ రైటర్ లకు నచ్చితేనే సినిమా హిట్ కాదు , కాకపోతే విశ్లేషణ చేస్తారు అంతే ! రివ్యూ లు బాగా వచ్చిన సినిమాలన్నీ హిట్స్ కాదు , బాగా రాకపోతే ఫ్లాప్ కాదు ప్రేక్షకులకు నచ్చింది మాత్రమే హిట్ అవుతుంది లేకపోతే ఫ్లాప్ అవుతుంది అది మాత్రమే కొలమానం . కానీ ఇంద్రసేన అనే మిడి మిడి జ్ఞానం ఉన్న దర్శకుడు రివ్యూ లను ఏకిపారేస్తూ పోస్ట్ చేయడం అతడి అవివేకానికి నిదర్శనం . ఇంతోటి సినిమా తీసి సుకుమార్ ని సవాల్ చేసే డైరెక్టర్ ని నేనే అని చెప్పడమే అతడి తెలివి తక్కువ తనానికి నిదర్శనం . ఇక ఈ గొడవ పెద్దది కాకముందే తేరు కోవాలని భావించిన శ్రీ విష్ణు ఆ దర్శకుడితో కానీ నిర్మాతలతో కానీ టచ్ లో లేను , నాకు రివ్యూ లపై నమ్మకం ఉందంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు .

English Title: Director indrasena controversial post on reviews