ప్రముఖ దర్శకుడికి నకిలీ ట్విట్టర్ అకౌంట్ కష్టాలు


ప్రముఖ దర్శకుడికి నకిలీ ట్విట్టర్ అకౌంట్ కష్టాలు
ప్రముఖ దర్శకుడికి నకిలీ ట్విట్టర్ అకౌంట్ కష్టాలు

తమిళంలో పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో hit లు ఇచ్చిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ వాళ్లలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ మరియు ఒక ప్రత్యేకమైన టేకింగ్ గల దర్శకుడు కె.ఎస్ రవికుమార్ గారు. సామాజిక ఇతివృత్తంతో హీరోయిజం మేళవించి ఆయన బిల్డ్ చేసే స్క్రిప్ట్ చాలా బాగుంటుంది. ఇండస్ట్రీ లో ఉండే బెస్ట్ టెక్నీషియన్లను ఉపయోగించుకొని తక్కువ సమయంలో పెద్ద బడ్జెట్ ఉన్నా కూడా క్వాలిటీ అవుట్ ఫుట్ ఇచ్చే దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కి పేరు ఉంది.

ఎలాంటి సంక్లిష్టమైన script అయినా కె.ఎస్.రవికుమార్ deal చేశాడంటే కచ్చితంగా మూడు నెలల్లో సినిమా తీసేస్తాడు. ఈ విషయాన్ని స్వయంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వారితో పాటు ఎంతోమంది అగ్రహీరోలు వేదికలపై చెప్పి ఉన్నారు. ఒక మామూలు కథని పట్టుకొని సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు సాగదీసే నాలెడ్జ్ మరియు విజన్ లేని దర్శకులు ఉన్న ఈ రోజుల్లో కె.ఎస్.రవికుమార్ లాంటి వారు కచ్చితంగా ఇండస్ట్రీకి కావాలి అని సినిమా విశ్లేషకుల అభిప్రాయం.

ఇక ఈ మధ్యనే నటసింహం నందమూరి బాలకృష్ణ గారితో కూడా చాలా తక్కువ సమయంలో రూలర్ అనే హై వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ స్టోరీ చేశారు. రవికుమార్ గారు. ప్రస్తుతం రవి కుమార్ సార్ కి నకిలీ ట్విట్టర్ అకౌంట్ వల్ల అనుకోని సమస్యలు ఎదురవుతున్నాయి. తమిళ అగ్ర హీరో తాలా అజిత్ & రవికుమార్ గారు ఒక సినిమాను చేస్తున్నారంటూ, ప్రచారం చేయడంతో పాటు.. ఇప్పటికే 30 శాతం షూటింగ్ కూడా పూర్తయిందనీ, సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా వస్తోందని ఆయన పేరు మీద కొంత మంది నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి న్యూస్ పబ్లిష్ చేస్తున్నారు.

గతంలో అజిత్ మరియు రవి కుమార్ గారి కాంబినేషన్ లో విల్లాన్, వరలారు, అనే సూపర్ హిట్ సినిమాలు వచ్చి ఉండటంతో ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అయితే తాజాగా ఇరు వర్గాలకు చెందిన పి.ఆర్ టీం లకు ఈ వార్త తెలియడంతో నేరుగా రవికుమార్ గారు లైన్ లోకి వచ్చి.. అది నకిలీ ట్విట్టర్ ఎకౌంట్ అనీ, తనది కాదని క్లారిటీ ఇచ్చారు.