రెమ్యున‌రేష‌న్‌లో స‌గం సేవాకార్య‌క్ర‌మాల‌కే?


రెమ్యున‌రేష‌న్‌లో స‌గం సేవాకార్య‌క్ర‌మాల‌కే?
రెమ్యున‌రేష‌న్‌లో స‌గం సేవాకార్య‌క్ర‌మాల‌కే?

కొంత మంది ఎంత కూడ‌బెట్టుకున్నామా?.. ఎన్ని కోట్లు వెన‌కేసుకున్నామా?..ఎన్ని ఆస్తులు పెంచుకున్నామా? అని చూస్తుంటారు. ఈ కాలంలో ఇది అత్యంత స‌హ‌జం. కానీ కొంత మంది మాత్ర‌మే అందుకు భిన్నంగా వుంటుంటారు. త‌మ కోసం కాకుండా త‌మ చుట్టూ వున్న వారి కోసం ప‌ని చేస్తుంటారు. జీవిస్తుంటారు. అలాంటి వ్య‌క్తే  స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.

రైట‌ర్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ఆయ‌న `మిర్చి` సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. తొలి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న ఆయ‌న త‌న సినిమాల్లో వామప‌క్ష భావ‌జాలాన్ని చూపిస్తూ స‌మాజానికి సందేశాన్ని అందిస్తున్నారు. మిర్చి. శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను.. నాలుగు చిత్రాల్లోనూ స‌మాజిక సందేశాల్ని అందించి ఆక‌ట్టుకున్న కొర‌టాల త‌న ఐద‌వ చిత్రంలోనూ అదే ప‌ని చేస్తున్నారు.

చిరంజీవితో `ఆచార్య‌` చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు యాభై శాతంచిత్రీక‌ర‌ణ పూర్తియింది. ఈ చిత్రానికి కొర‌టాల పారితోషికం 15 కోట్ల‌ని తెలిసింది. ఈ పెద్ద మొత్తంలోని స‌గ‌భాగాన్ని కొర‌టాల చారిటీకి అందించ‌డం ఇప్పుడు టాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పిల్ల‌ల్ని వ‌ద్ద‌నుకున్న కొర‌టాల త‌న సంపాదించి  మొత్తంలో స‌గాన్ని చారిటీల‌కే ఖ‌ర్చు చేయ‌డం ప‌లువురిని ఆలోచింప‌జేస్తోంది.