ఇంతకీ కొరటాల శివ తర్వాతి సినిమా ఎవరితో


director koratala siva next movie with chiranjeevi

భరత్ అనే నేను చిత్రంతో మరోసారి సంచలన విజయం సాధించి హ్యాట్రిక్ ని కంప్లీట్ చేసి దిగ్విజయంగా రెండో హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాడు . మిర్చి చిత్రంతో దర్శకుడిగా మొదటి చిత్రంతోనే సంచలన విజయం సాధించిన కొరటాల శివ శ్రీమంతుడు తో ఇండస్ట్రీ హిట్ ని కొట్టాడు దాని తర్వాత జనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ ని కంప్లీట్ చేసాడు . తాజాగా మహేష్ బాబు తో భరత్ అనే నేను చిత్రం చేసాడు ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది దాంతో కొరటాల తదుపరి చిత్రం పై ఆసక్తి నెలకొంది .

వరుసగా నాలుగు చిత్రాలు ఘనవిజయం సాధించడంతో కొరటాల శివ తో సినిమాలు చేయడానికి పలువురు అగ్ర హీరోలు పోటీపడు తున్నారు . ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో కొరటాల శివ తదుపరి సినిమా ఉండబోతోంది అన్న మాట వినిపిస్తోంది . ఇప్పటికే నాని తో సినిమా అని కూడా వినిపిస్తోంది అలాగే నాగచైతన్య పేరు కూడా కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి తోనే కొరటాల సినిమా ఉంటుందని తెలుస్తోంది . ప్రస్తుతం చిరంజీవి సైరా ….. నరసింహారెడ్డి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే .