`ఆహా` కోసం క్రిష్‌ని దించేస్తున్నారా?

`ఆహా` కోసం క్రిష్‌ని దించేస్తున్నారా?
`ఆహా` కోసం క్రిష్‌ని దించేస్తున్నారా?

మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రేట్లు పెరిగిపోవ‌డం, న‌లుగురు వెళ్లితే వెయ్యికి పైగా ఓ కుటుంబం ఖ‌ర్చుచేయాల్సి రావ‌డం వంటి కార‌ణాల‌తో జ‌నం ఎక్కువ‌గా ఓటీటీల‌కు డైవ‌ర్ట్ అయిపోతున్నారు. ఒక్క సినిమాకు అయ్యే ఖ‌ర్చుని ఏడాది పాటు స‌బ్‌స్క్రిప్షన్‌కి క‌ట్టేస్తే న‌ట్టింట్లోనే న‌చ్చిన‌ సినిమా చూసేయోచ్చు. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇది ఉత్త‌రాది మొద‌లైన ఓటీటీల ప‌రంప‌ర అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్‌, జీ5ల‌తో ద‌క్షిణాదికి కూడా విస్త‌రించేసింది.

దీన్ని బీట్ చేయాల‌నే ల‌క్ష్యంతో  స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, మై హోమ్ రామేశ్వ‌ర‌రావు సంయుక్తంగా ప్రాంభించిన డిజిట‌ల్ మాధ్య‌మం `ఆహా`. అయితే ఇది అనుకున్న స్థాయిలో మాత్రం వ్యూవ‌ర్స్‌ని ఆక‌ట్టుకోలేక‌పోతోంది. కొంత ఓల్డ్ కంటెంట్ వుండ‌టం ఓ కార‌ణం కాగా, మిగ‌తా వాటితో పోలిస్తే అడ‌ల్ట్ కంటెంట‌ట్ చాలా త‌క్కువ‌గా వుంది. ప్ల‌స్ రిజ్ లుక్ వున్న కంటెంట్ కూడా లేక‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది.

ఆ లోపాన్ని అధిగ‌మించ‌డం కోసం అల్లు అర‌వింద్ ద‌ర్శ‌కుడు క్రిష్‌ని రంగంలోకి దింపుతున్న‌ట్టు తెలుస్తోంది. `ఆహా` కోసం ఇప్ప‌టికే క్రిష్ అల్ట్ర మోడ్ర‌న్ స్టైల్‌ల్లో `మ‌స్తీస్` పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని అందించాడు. న‌వ‌దీప్‌, చాందీన చౌద‌రీల‌పై చిత్రీక‌రించిన హాట్ హాట్ స‌న్నివేశాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి కూడా. అదే త‌ర‌హా కంటెంట్‌ని పెంచి వ్యూవ‌ర్స్‌ని మ‌రింత‌గా ఎట్రాక్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.