క్రిష్ కండీషన్ లు పెడుతున్నాడట


director krish conditions for ntr biopic

ఎన్టీఆర్ బయోపిక్ జనరంజకంగా తీయాలి అని బాలకృష్ణ కసిగా ఉన్నాడు . ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుండి దర్శకులు తేజ తప్పుకున్నాడు అయితే అతడి స్థానంలో పలువురు దర్శకులను అనుకున్నాడు బాలయ్య కానీ ఎవరు కూడా సెట్ కాకపోవడంతో తానే దర్శకత్వం వహించాలని డిసైడ్ అయ్యాడు కానీ మహానటి విడుదలై సంచలన విజయం సాధించడంతో ఎన్టీఆర్ బయోపిక్ మహానటి ని మించేలా ఉండాలి కానీ ఏమాత్రం తగ్గినా అది పరువుకు సంబందించిన వ్యవహారం కావడంతో బాలయ్య పునరాలోచనలో పడ్డాడు .

దాంతో తనకు గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి గొప్ప విజయాన్ని అందించిన క్రిష్ ని ఎన్టీఆర్ బయోపిక్ కి ఫిక్స్ చేయాలనీ భావించాడట . క్రిష్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ పట్ల ఆసక్తిగా ఉన్నాడు అయితేఉన్న చిక్కు ఏంటంటే ……. ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రస్తుతం అనుకున్న కథ , కథనం స్థానంలో తానే స్వయంగా ఎంపిక చేసుకుంటానని కండిషన్ పెడుతున్నాడట . క్రిష్ అర్ధం ఏంటంటే …… స్క్రిప్ట్ నాకు నచ్చినట్లు రెడీ చేసుకుంటాను అని తేల్చి చెప్పడం అన్నమాట . మరి ఇందుకు బాలయ్య కానీ మిగతావాళ్ళు కానీ ఒప్పుకుంటారా చూడాలి .