అయ్యో ! నోరు మెదపడం లేదే

director krish in silent modeమణికర్ణిక బాలీవుడ్ చిత్రం నుండి క్రిష్ ని తప్పించారని , లేదు లేదు కంగనా రనౌత్ తో ఇబ్బంది పడేకంటే తప్పుకోవడం బెటర్ అని భావించి క్రిష్ తప్పుకున్నాడని కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఈలోగా మణికర్ణిక ప్యాచ్ వర్క్ అంటూ కంగనా రనౌత్ డైరెక్షన్ చేయడం ,అదే సమయంలో కంగనా పేరు డైరెక్టర్ గా ఉండటం కూడా వివాదానికి మరింత ఆజ్యం పోసింది అయితే ఇంతగా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కాని వివాదం జరుగుతున్నా దర్శకులు క్రిష్ మాత్రం నోరు మెదపడం లేదు దాంతో అసలు మణికర్ణిక విషయంలో ఏం జరుగుతోంది అంటూ డోలాయమానంలో ఉన్నారు .

ఇన్ని కథనాలు వస్తున్నప్పటికీ దర్శకులు క్రిష్ మాత్రం దీనిపై మాట్లాడటం లేదు తన పని తను చేసుకుపోతున్నాడు . ప్రస్తుతం ఈ హీరో ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే . కంగనా రనౌత్ తో క్రిష్ కు విబేధాలు వచ్చాయని అందుకే ఆ సినిమాని పక్కన పెట్టేసి ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు . క్రిష్ ఆ సినిమాని వదిలేసిన తర్వాత ఇటీవలే నటుడు సోనూ సుద్ కూడా కంగనా తో విబేధించి మణికర్ణిక నుండి తప్పుకున్నాడు .

English Title: director krish in silent mode