క్రిష్ రెండు రంగాల్లో ఫుల్ బీజీ!క్రిష్ రెండు రంగాల్లో ఫుల్ బీజీ!
క్రిష్ రెండు రంగాల్లో ఫుల్ బీజీ!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా కొంత అంతా ఇంటికే ప‌రిమితం అయిపోయారు. ఈ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని ఎలా గ‌డ‌పాలా అని కొంత మంది ఆలోచిస్తుంటే సినీ డైరెక్ట‌ర్‌లు మాత్రం కొత్త క‌థ‌ల‌పై దృష్టిపెట్టారు. స‌మ‌యం చాలా చిక్క‌డం, తిరిగే ప‌ని త‌గ్గ‌డంతో కొత్త క‌థ‌లు రాసుకోవ‌డానికి ద‌ర్శ‌కుల‌కు కావాల్సినంత టైమ్ చిక్కింది. దీంతో పెన్నుకి ప‌ని పెట్టారు.

దర్శ‌కుడు క్రిష్ కూడా ఇదే ప‌స‌నిలో బిజీ అయిపోయారు.  ఓ ప‌క్క త‌ను చేస్తున్న పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నా వెబ్ సిరీస్ స్క్రిప్ట్‌ల‌ని కూడా వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల అల్లు అర‌వింద్‌కు సంబంధించిన `ఆహా` కోసం `మ‌స్తీస్‌` అనే పేరుతో ఓ వెబ్ సిరీస్‌ని చేశారు క్రిష్‌. దీనికి క‌థ అందించ‌డంతో పాటు ఆయ‌నే నిర్మించారు.

`ఆహా`లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇటీవ‌లే 10 మిలియ‌న్ వ్యూస్‌ని దాటేసింది. న‌వ‌దీప్‌, బిందు మాధ‌వి, హేబా ప‌టేల్‌, చాందిని చౌద‌రి, అక్ష‌రా గౌడ‌, రాజా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తొలి భాగానికి హ్యూజ్ రెస్పాన్స్ రావ‌డంతో త్వ‌ర‌లోనే దీనికి సీక్వెల్‌ని చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్రస్తుత లాక్‌డౌన్ పిరియ‌డ్‌లో సీక్వెల్‌కి క‌థ‌ని సిద్ధం చేస్తున్నార‌ట క్రిష్‌.