వెంకటేష్ కొత్త సినిమాకు దర్శకుడు అతడేనా ?


Director locked for venkatesh new film
Director locked for venkatesh new film

కోలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుకున్న అసురన్ సినిమా ఇండియన్ సినీ లవర్స్ ని ఎంతగానో ఆకర్షించింది. ప్రతి ఇండస్ట్రీలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రీమేక్ హక్కుల కోసం పోటీ పెరుగుతున్న సమయంలో ముందస్తు ఆలోచనతో నిర్మాత సురేష్ బాబు తెలుగు హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన ఒక స్పెషల్  న్యూస్ ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతోంది. సినిమాకు ఓంకార్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే ఓంకార్ తో వెంకీ రాజుగారి గది ఫార్మాట్ లోనే పార్ట్ 4 తీయాలని అనుకున్నారు. ఈ విషయంపై ఓంకార్ కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు సురేష్ బాబు ఆలోచనతో  అసురన్ కథపై ఓంకార్ ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

తమిళ్ లో దాదాపు 100కోట్లకు పైగా వసూళ్లను అందుకున్న అసురన్ కి వెట్రి మారన్ దర్శకత్వం వహించాడు. ఈ యాక్షన్ డ్రామా కథలో ధనుష్ విభిన్న గెటప్పుల్లో స్క్రీన్ పై అద్భుతమైన నటనను ప్రజెంట్ చేశాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ కూడా ఆ డే తరహాలో న్యాయం చేయడానికి తనదైన శైలిలో సిద్దమవుతున్నాడు. అయితే ఓంకార్ ఈ ప్రాజెక్ట్ ని ఎంతవరకు డీల్ చేస్తాడో చూడాలి.