గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మణిరత్నం


దక్షిణాదిన ప్రముఖ దర్శకులు అయిన మణిరత్నం కు నాలుగోసారి గుండెపోటు వచ్చింది దాంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు మణిరత్నం కుటుంబ సభ్యులు . ఈరోజు ఉదయం మళ్ళీ గుండెపోటు రాగానే వెంటనే ఆసుపత్రికి తరలించారు . అయితే ప్రమాదం ఏమి లేదని డాక్టర్లు చెప్పడంతో షాక్ నుండి తేరుకున్నారు . తన భర్తకు మళ్ళీ గుండెపోటు రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యింది సుహాసిని .

ఇంతకుముందు 2004 లో మొదటిసారి మణిరత్నం కు గుండెపోటు వచ్చింది . ఆ తర్వాత వరుసగా 2015 లో 2018 లో గుండెపోటు తో ఆసుపత్రిలో చికిత్స పొందాడు . అయితే మూడుసార్లు కూడా మళ్ళీ కోలుకున్న మణిరత్నం కు ఈసారి నాలుగోసారి గుండెపోటు వచ్చింది . చాలాకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు మణిరత్నం . ఒకప్పుడు అజరామరమైన చిత్రాలను అందించిన మణిరత్నం ఇప్పుడు వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు .