మణిరత్నం కు గుండెపోటు


director maniratnam in apollo hospital

దర్శక నిర్మాత మణిరత్నం (62) గుండెపోటు తో చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమిళ్ లో పలు సంచలనాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన మణిరత్నం అసలు పేరు గోపాలరత్నం సుబ్రహ్మణ్యం కాగా స్క్రీన్ నేమ్ మణిరత్నం అయ్యింది. తమిళ్ లొనే కాకుండా తెలుగులో కూడా సంచలనాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు మణిరత్నం. అయితే గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు మణిరత్నం. వరుస పరాజయాలు మణిరత్నం ని ఆర్ధికంగా , మానసికంగా దెబ్బతీసాయి. అయితే ప్లాప్ లు ఎదురైనప్పటికి మళ్లీ సక్సెస్ కొట్టాలని మళ్లీ ఓ సినిమా ప్రయత్నం చేస్తున్నాడు మణిరత్నం. కాగా ఈ సమయంలో గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.

1988 లో అప్పటి అగ్ర కథానాయికగా రాణిస్తున్న సుహాసిని ని పెళ్లి చేసుకున్నాడు మణిరత్నం. చారుహాసన్ , కమల్ హాసన్ లతో పలు చిత్రాలు చేసాడు మణిరత్నం ఆ క్రమంలో సుహాసిని ని పెళ్లి చేసుకున్నాడు మణిరత్నం. సుహాసిని కూడా పెళ్లి చేసుకున్నాక సినిమాలు మానేసి సంసార జీవితంలో కొనసాగింది. ఆ తర్వాత పిల్లలు పుట్టాక మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది సుహాసిని. భర్త గుండెపోటు తో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆందోళన గా ఉంది. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఏమి లేదని కొలుకుంటారనే నమ్మకం ఉందని అంటున్నారు. 62 ఏళ్ల మణిరత్నం త్వరగా కోలుకుని ఇంటికి రావాలని మళ్లీ తనదైన శైలిలో సినిమాలు చేయాలని ఆశిద్దాం.

English Title: director maniratnam in apollo hospital