మారుతి డ్రీమ్ నిజం కాబోతోందా?


మారుతి డ్రీమ్ నిజం కాబోతోందా?
మారుతి డ్రీమ్ నిజం కాబోతోందా?

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కి చక్క‌ని వినోదాన్ని జోడించి చిత్రాలు తెర‌కెక్కిస్తుంటారు యువ ద‌ర్‌శ‌కుడు మారుతి. ఇటీవ‌ల సాయిధ‌ర‌హ్‌తేజ్‌తో వినోదాన్ని పండిస్తూనే భావోద్వేగ‌భ‌రిత క‌థ‌, క‌థ‌నాల‌తో `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా స‌క్సెస్ ఇచ్చిన జోష్‌లో మారుతి కొత్త సినిమా కోసం స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే ప‌నిలో వున్నారు.

ఇదిలా వుంటే గ‌త కొంత కాలంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తే సినిమా చేయాల‌ని మారుతి ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్‌తో సినిమా చేయాల‌న్న‌ది మారుతి డ్రీమ్‌. ఆ డ్రీమ్ త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఓ సంద‌ర్భంగా మంచి క‌థ సిద్ధం చేసుకుని వ‌స్తే క‌లిసి ప‌నిచేద్దామ‌ని అల్లు అర్జున్ ద‌ర్‌శ‌కుడు మారుతికి మాటిచ్చిన‌ట్టు తెలిసింది.

ఆ మాట ప్ర‌కార‌మే బ‌న్నీకి త‌గ్గ స్టోరీని మారుతి సిద్ధం చేస్తున్నార‌ట‌. అది క‌న‌క అల్లు అర్జున్‌కి న‌చ్చి సినిమా ప‌ట్టాలెక్కితే మారుతి ఎన్నో ఏళ్ల క‌ల నిజం కావ‌డం ఖాయం అంటున్నారు అత‌ని స‌న్నిహితులు. కెరీర్  తొలి నాళ్ల‌లో మారుతికి అల్లు ఫ్యామిలీ అండ‌గా నిలిచింది. ఆ కృత‌జ్ఞ‌త కోస‌మే బ‌న‌ర్నీతో సినిమా చేయాల‌ని చాలా కాలంగా మారుతి ఎదురుచూస్తున్నార‌ట‌.