ఆ ఫస్ట్ లుక్ ఫేక్ అట


director maruthi clarity on sailajareddy alludu first lookఅక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ” శైలజారెడ్డి అల్లుడు ” చిత్ర ఫస్ట్ లుక్ ఇదే అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దాంతో దర్శకులు మారుతి స్పందించాడు . అది ఫేక్ లుక్ అని , మరో వారం రోజుల్లోనే ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు . శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా అతడి సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది ఇక శైలజారెడ్డి పాత్రలో మాజీ హాట్ భామ రమ్యకృష్ణ నటిస్తోంది . దర్శకులు మారుతి కావడంతో వినోద ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నారు .

ఒకప్పుడు అల్లుడు – అత్త ఫార్మెట్ లో బోలెడు చిత్రాలు వచ్చాయి తెలుగునాట , అయితే ఆ చిత్రాల హవా ఇప్పుడు తగ్గింది కట్ చేస్తే మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అత్త – అల్లుడు కాన్సెప్ట్ లో వస్తున్న సినిమా ఇది . ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు . అక్కినేని నాగచైతన్య కు ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ ని ఇస్తుందని భావిస్తున్నాడు . ఇక ఫేక్ లుక్ విషయానికి వస్తే …… ఎవరో అభిమాని అత్యుత్సాహంతో చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది దాంతో అది ఫేక్ అని చెప్పడానికి సోషల్ మీడియాని వాడుకున్నాడు మారుతి .