నయనతార ఘోరంగా అవమానించిందట


Director maruthi explains about controversy with nayanataraనయనతార బిహేవ్ సరిగా లేదని నాలాంటి చిన్న వాళ్లకు గౌరవం ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని స్టార్ హీరోని గౌరవించాలా ? లేదా ? కానీ నయనతార మాత్రం ఘోరంగా బిహేవ్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శకులు మారుతి . వెంకటేష్నయనతార జంటగా ” బాబు బంగారం ” అనే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే . ఆ చిత్రానికి మారుతి దర్శకుడు అన్న విషయం కూడా విదితమే ! కాగా ఆ సినిమా షూటింగ్ సమయంలో నయనతార చాలా రగ్గుడ్ గా బిహేవ్ చేసేదట .

నేనంటే చిన్న దర్శకుడిని కాబట్టి గౌరవం ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోకు కూడా గౌరవం ఇవ్వలేదని అందుకే నయనతార తో గొడవ పెట్టుకున్నానని చెప్పేసాడు మారుతి . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన నయనతార ఇక్కడ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ హీరోలను లెక్కచేయకుండా అవమానిస్తోంది అంతేకాదు సినిమా చేస్తాను తప్ప ప్రమోషన్ కార్యక్రమాలకు రానని కూడా తేల్చి చెప్పేస్తోంది . అయినా ఇంతగా అవమానిస్తున్నా కూడా మళ్ళీ ఆ భామనే పెట్టి మరీ సినిమాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు అందుకే అలా బిహేవ్ చేస్తోంది నయనతార . ఇక మారుతి విషయానికి వస్తే …… నాగచైతన్య హీరోగా శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని చేసాడు . ఇటీవలే విడుదలైన ఆ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి .

English Title: Director maruthi explains about controversy with nayanatara