మెగాస్టార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు


director mysskin sensational comments on mammootty

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు దర్శకుడు మిస్కిన్ . తమిళ , మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించిన మిస్కిన్ తాజాగా మమ్ముట్టి హీరోగా నటించిన ” పేరాన్బు ” చిత్రానికి దర్శకత్వం వహించాడు . కాగా ఆ చిత్ర టీజర్ ని విడుదల చేసే కార్యక్రమంలో మాట్లాడిన దర్శకులు మిస్కిన్ మమ్ముట్టి యాక్షన్ చూస్తూ అలా ఉండిపోయానని, అంత అద్భుతంగా ఆయన నటించాడని ఈ పాత్రలో మమ్ముట్టి కాకుండా మరో హీరో అయితే ఖచ్చితంగా ఓవర్ యాక్షన్ చేసేవాళ్లని …… ఒకవేళ మమ్ముట్టి ఆడపిల్ల అయితే కనుక ఖచ్చితంగా రేప్ చేసేవాడినని సంచలన వ్యాఖ్యలు చేసాడు మిస్కిన్ .

వేదిక పై మలయాళ మెగాస్టార్ ని ఒక దర్శకుడు అలా కామెంట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు , అసలు మిస్కిన్ ఏం మాట్లాడుతున్నాడో తెలీక ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయారు . కొద్దిసేపటి తర్వాత కానీ ఆ షాక్ నుండి తేరుకోలేదు ఆ వేడుకలో పాల్గొన్న వాళ్ళు . మమ్ముట్టి అద్భుతంగా నటించాడని చెప్పడానికి బదులు బాగా నటించాడు కాబట్టి రేప్ చేసేవాడినని అసభ్యంగా ఎలా కామెంట్ చేస్తాడు ఈ దర్శకుడు అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మలయాళంలో మమ్ముట్టి పెద్ద స్టార్ కాబట్టి మమ్ముట్టి ఫ్యాన్స్ ఆగ్రహానికి మిస్కిన్ గురి కావడం ఖాయం .

English Title: director mysskin sensational comments on mammootty